AP Crime News: చిన్న తొందరపాటు.. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.. వాటర్ హీట్ చేస్తుండగా..

|

Feb 05, 2022 | 7:54 AM

Visakhapatnam Crime News: చిన్న తొందర పాటు చర్య.. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఎలాంటి చిన్న జాగ్రత్త తీసుకున్నా ఆ ప్రాణం నిలిచేది. అయితే.. ఈ ఘటనతో

AP Crime News: చిన్న తొందరపాటు.. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.. వాటర్ హీట్ చేస్తుండగా..
Water Heater Death
Follow us on

Visakhapatnam Crime News: చిన్న తొందర పాటు చర్య.. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఎలాంటి చిన్న జాగ్రత్త తీసుకున్నా ఆ ప్రాణం నిలిచేది. అయితే.. ఈ ఘటనతో ఇద్దరు పిల్లలతో పాటు.. అతని భార్య అనాధగా మారింది. చిన్న అజాగ్రత్త వల్ల నిండు ప్రాణం పోయిన ఈ విషాద ఘటన విశాఖపట్నం జిల్లా పాడేరు మండలం గుతులపుట్‌ గ్రామంలో జరిగింది. ఈశ్వరరావు అనే వ్యక్తి ఏపీ జెన్‌కో (ap genco) లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. అంతకు ముందు పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో హోంగార్డుగా పని చేసిన ఈశ్వరరావు.. డిప్యూటేషన్‌పై 2009 జెన్‌కో వచ్చారు. డ్యూటీకి వెళ్లేందుకు ఎలక్ర్టికల్‌ హీటర్‌ (Water heater) తో నీళ్లు హీట్‌ చేసుకున్నాడు. అయితే.. ప్రమాదవశాత్తు హీటర్‌ తగిలి షాక్‌ కొట్టింది. కింద పడిపోయిన ఈశ్వరరావును కాపాడేందుకు భార్య ఇరుగు పొరుగు వారి సాయంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు.

చనిపోయిన ఈశ్వరరావుకి భార్యతో పాటు.. ఇద్దరు పిల్లలున్నారు. స్పాట్‌కు చేరుకున్న జెన్కో అధికారులు, పోలీసులు పరిసరాలను పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

Also Read:

AP Crime News: విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టిన బైక్‌.. ముగ్గురు విద్యార్థులు దుర్మరణం..

Vijayawada: గన్నవరం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఘరానా మోసం.. తప్పుడు పత్రాలతో రూ.10 లక్షలకు టోకరా పెట్టిన అసిస్టెంట్‌ మేనేజర్‌..