జూరాలకు కొనసాగుతున్న వరద..6 గేట్లు ఎత్తి నీటి విడుదల

నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తీవ్ర స్థాయిలో కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద నీటి ప్రవాహం పెరగడంతో కృష్ణా బేసిన్ కు సంబంధించి ఒక్కో ప్రాజెక్టు నిండుకుంటూ వస్తున్నాయి. జూరాల ప్రాజెక్టు..

జూరాలకు కొనసాగుతున్న వరద..6 గేట్లు ఎత్తి నీటి విడుదల
Follow us

|

Updated on: Jul 15, 2020 | 3:38 PM

నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తీవ్ర స్థాయిలో కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద నీటి ప్రవాహం పెరగడంతో కృష్ణా బేసిన్ కు సంబంధించి ఒక్కో ప్రాజెక్టు నిండుకుంటూ వస్తున్నాయి. జూరాల ప్రాజెక్టు కు వరద క్రమంగా పెరుగుతోంది. మంగళవారం రాత్రి నుండి గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల ప్రారంభించిన అధికారులు తొలుత రెండు గేట్లు ఎత్తారు. పెరుగుతున్న వరదకు అనుగుణంగా బుధవారం ఉదయం మరో నాలుగు గేట్లు మొత్తం 6 గేట్లు ఎత్తి నీటివిడుదల పెంచారు అధికారులు.

60 వేల క్యూసెక్కులుగా జూరాలకు ఇన్ ఫ్లో కొనసాగుతుండగా,…డ్యాం పూర్తిగా నిండిపోయింది. దీంతో వచ్చిన వరద నీటిని వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం 59వేల380 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు.. కాగా ప్రస్తుతం నీట్టి 8.969 టీఎంసీలు ఉంది. పూర్తి స్థాయి మట్టం: 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 318.180 మీటర్లుగా ఉంది. జూరాలకు వరద ఉధృతి పెరగడం.. స్పిల్ వే గేట్లు ఎత్తడంతో అధికారులు విద్యుత్ ఉత్పాదన ప్రారంభించారు. మూడు యూనిట్లలో జలవిద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.