హైద‌రాబాద్ మీద ఆధార‌ప‌డ‌ని తొలి ఆంధ్రా సినిమా ఇదే…త్వరలోనే తెరమీదకు

ఏపీ - తెలంగాణ విభజన త‌ర్వాత ఏపీ సినిమా.. నైజాం సినిమా అంటూ డివైడ్ అవుతుంద‌నే భావించారు. కానీ ఇప్పటికీ ఆ విభ‌జ‌న రేఖ‌ సినిమా వ‌ర‌కూ వ‌ర్తించ‌లేదు. అయితే ఇప్పుడు ఏపీ సినిమా ఏపీనే అంటోంది ఈ టీమ్.

హైద‌రాబాద్ మీద ఆధార‌ప‌డ‌ని తొలి ఆంధ్రా సినిమా ఇదే...త్వరలోనే తెరమీదకు
Follow us

|

Updated on: Oct 06, 2020 | 4:05 PM

ఏపీ – తెలంగాణ విభజన త‌ర్వాత ఏపీ సినిమా.. నైజాం సినిమా అంటూ డివైడ్ అవుతుంద‌నే భావించారు. కానీ ఇప్పటికీ ఆ విభ‌జ‌న రేఖ‌ సినిమా వ‌ర‌కూ వ‌ర్తించ‌లేదు. అయితే ఇప్పుడు ఏపీ సినిమా ఏపీనే అంటోంది ఈ టీమ్. ఏపీ న‌టీన‌టులు .. ఏపీ టెక్నీషియ‌న్స్‌తో సినిమా ఆద్యంతం ఏపీలోనే పూర్తి చేస్తున్నామ‌ని.. ఏపీ లొకేష‌న్స్‌నే ఉప‌యోగిస్తున్నామ‌ని చెబుతున్నారు. ఇంత‌కీ ఎవ‌రు వీళ్లు.. ఎందుకీ నిర్ణయం. అస‌లు ఉద్ధేశ‌మేమిటో తెలియాలంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే..

ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమాకి మాజీ ఎంపీ హర్షకుమార్ రాజమండ్రి లో ఇదివర‌కే క్లాప్ కొట్టడం విశేషం. ఇప్పటికే టాకీ చిత్రీక‌ర‌ణ పూర్తయ్యింది. రాజమండ్రి వాస్తవ్యుడు రాజ్ కుమార్ చీపురు దర్శకత్వంలో రాజమండ్రి చుట్టుపక్కల పరిసర గ్రామాల నుండి కేవలం 30 కిలోమీట‌ర్ల రేడియస్ వ్యవధిలోనే నటీ నటులను ఎంపిక చేసుకుని ఒక ఫుల్ లెంత్ యాక్షన్ సినిమా నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా మాజీ ఎంపీ హర్షకుమార్ మంగళవారం రోజు షూటింగ్ స్పాట్ కు వెళ్లి క్లాప్ కొట్టారు. మొత్తం సినిమా రెండు గంటల వ్యవధి కాగా.. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ వెంకటేష్ చింతాకుల ఈ చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్ లో సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇది ఒక ఫిక్షన్ స్టోరీ అయినా చాలా రియలిస్టిక్ గా తెర‌పై ఆవిష్కరిస్తున్నారు.

ఈ సినిమా ముఖ్య ఉద్దేశం హైదరాబాద్ మీద ఆధారపడకుండా.. కేవలం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి నటీనటులు.. టెక్నికల్ టీం తో పూర్తి సినిమాను తెరమీదకు తీసుకురావడ‌మే. మొదట హైదరాబాద్ లో ఉన్న ప్రసాద్ ల్యాబ్స్ లో సినిమా ఎడిటింగ్ చేయాల‌నుకున్నారు. కానీ ఇదే సినిమా నిమిత్తమై మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచెను కూడా సంప్రదించారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించి సినిమాకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. పాట‌ల కోసం ఒప్పుకున్నా అది కూడా క్యాన్సిల్ చేశాం. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో కూడా హైదరాబాద్ అవసరం లేకుండా బొమ్మూరుకు చెందినటువంటి సల్మాన్ అనే ఒక యంగ్ మ్యూజిక్ టీం తో ముందుకు వెళుతున్నాం. స‌ల్మాన్ ఇంతకముందు హైదరాబాద్ లో ఎక్స్ ట్రీమ్ సౌండ్స్ లో మిక్స్ డ్ ఇంజినీర్ గా పనిచేసారు. ఇది ఇలా ఉంటే.. ఎడిటింగ్ ని ప్రసాద్ ల్యాబ్స్ నుంచి ఉన్నటువంటి ఒప్పందాన్ని రద్దు చేసి.. జగ్గంపేటకు చెందిన పి. నాగేంద్ర అనే ఒక ఎక్స్ ఆర్మీ (35 ఏళ్ల అనుభ‌వం-రిటైర్డ్) ఎడిటింగ్ చేస్తున్నారు. ఆయ‌న‌కు ఈ వృత్తి ఫ్యాషన్.

డబ్బింగ్ కోసం హైదరాబాద్ వెళ్లకుండా రాజమండ్రి కి సంబంధించిన రాజేంద్ర డబ్బింగ్ స్టూడియోలోనే ప‌ని జరుగుతుంది. కలర్ కరెక్షన్ కూడా హైదరాబాద్ స్టూడియో లోకి వెళ్లకుండా రాజమండ్రిలోనే ఎడిటర్ సతీష్ ఫైనల్ కట్ ప్రోలు బి ఐ పద్ధతిలో సినిమా నిర్మాణం చేస్తున్నారు. ఈ సినిమాకి మాజీ ఎంపీ హర్షకుమార్ గారి కోడలు అనిత ప్రొడ్యూసర్ గా ఉన్నారు. అయితే పూర్తి కథ అందించింది మట్కా హర్షకుమార్ పెద్ద కుమారుడు శ్రీరాజ్. ఈ చిత్రానికి రాజమండ్రి మెయిన్ రోడ్డు వండర్ ల్యాండ్ మార్కెట్ బట్టల షాపు శ్యామ్ రైటర్ గా పని చేస్తున్నారు. ప్రొడక్షన్ అంతా ప్రసాద్ నాని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. డిస్కవరీ ఛానల్ కి సౌండ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి నవనీత్ చారి రాజమండ్రి వాసి. ఆయ‌న‌ ఈ సినిమాకి మిక్సింగ్ యూనిట్ ఇంజినీర్ గా వ్యవహరిస్తున్నారు.

ఈ సినిమా ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే హైదరాబాద్ మీద ఆంధ్రా వాళ్ళు ఆధారపడకుండా ఫుల్ లెన్త్ సినిమాని తెర మీదకి తీసుకురావడమే. ఈ సినిమా ఇప్పటికే 100ప‌ర్సంట్ షూటింగ్ పూర్తి చేసుకుని ఎడిటింగ్ ప్రాసెస్ లో వుంది. అక్టోబ‌ర్ 23 హర్షకుమార్ పుట్టిన రోజు సందర్భంగా ట్రైలర్ లాంచ్ ప్రోగ్రాం ఉంటుందని చిత్రయూనిట్ వెల్లడించింది.