దివ్య కేసు: నిలకడగా నాగేంద్ర బాబు ఆరోగ్యం

విజయవాడలో సంచలనం సృష్టించిన దివ్య తేజస్విని హత్య కేసు ప్రధాన నిందితుడు నాగేంద్రబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని గుంటూరు

దివ్య కేసు: నిలకడగా నాగేంద్ర బాబు ఆరోగ్యం

Edited By:

Updated on: Oct 19, 2020 | 9:43 AM

Divya Tejaswini Case Updates: విజయవాడలో సంచలనం సృష్టించిన దివ్య తేజస్విని హత్య కేసు ప్రధాన నిందితుడు నాగేంద్రబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అతడి కడుపులో పేగులకు అయిన గాయాలకు ఆపరేషన్‌ చేసిన వైద్యులు.. పోస్టు ఆపరేటివ్‌ ఐసీయూ వార్డుకు మార్చారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోందని, అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆర్‌ఎంఓ సతీష్‌ తెలిపారు. నాగేంద్రబాబు గాయపడి 48 గంటలు దాటిందని, కొంతమేరకు కోలుకున్నాడని సతీష్‌ వెల్లడించారు. ఇవాళ అతడి ఆరోగ్య పరిస్థితిని వైద్య అధికారులు పరీక్షించిన తరువాత తదుపరి వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు.

Read More:

కరోనా అప్‌డేట్స్‌: ప్రపంచవ్యాప్తంగా 4కోట్లు దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య

Official: నిఖిల్‌ ’18 పేజెస్‌’లో అనుపమ కన్ఫర్మ్‌