కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 983 కొత్త కేసులు.. 11 మరణాలు

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల్లో రాష్ట్రంలో 983 కొత్త కేసులు నమోదయ్యాయి.

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 983 కొత్త కేసులు.. 11 మరణాలు

Updated on: Aug 03, 2020 | 9:35 AM

Corona Cases Telangana Today: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. 24 గంటల్లో రాష్ట్రంలో 983 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 67,660కు చేరింది. 11 మంది కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 551కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 1019 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 48,609కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 18,500 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 273, ఆదిలాబాద్ 16, భద్రాద్రి కొత్తగూడెం 16, జగిత్యాల్‌ 12, జనగాం 13, జయశంకర్ భూపాలపల్లి 12, జోగులమ్మ గద్వాల్‌ 12, కామారెడ్డి 28, కరీంనగర్‌ 54, ఖమ్మం 23, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 7, మహబూబ్‌ నగర్‌ 21, మహబూబాబాద్‌ 18, మంచిర్యాల్‌ 1, మెదక్‌ 18, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి 408, ములుగు 14, నాగర్‌ కర్నూల్‌ 32, నల్గొండ 11, నారాయణ్‌పేట్‌ 2, నిర్మల్‌ 2, నిజామాబాద్‌ 42, పెద్దంపల్లి 44, రాజన్న సిరిసిల్ల 20, రంగారెడ్డి 73, సంగారెడ్డి 37, సిద్ధిపేట్‌ 6, సూర్యాపేట 11, వికారాబాద్‌ 4, వనపర్తి 26, వరంగల్‌ రూరల్‌ 25, వరంగల్‌ అర్బన్‌ 57, యాద్రాది భువనగిరి 5 కేసులు నమోదయ్యాయి.

Read This Story Also: ఎమ్మెల్సీ నారదాసు, ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి కుటుంబాల్లో కరోనా

Loading...
Unable to load recommendations.
Follow Us