కరోనా మృతుల అంత్యక్రియల్లో అపోహలకు గురికావొద్దు

కరోనా మరణించిన వారి మృతదేహాలను ఖననం చేసుకోవడానికి బంధువులు, మిత్రులు అపోహలకు గురి కావొద్దని ఏపీ వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు.

కరోనా మృతుల అంత్యక్రియల్లో అపోహలకు గురికావొద్దు
Follow us

| Edited By:

Updated on: Jul 29, 2020 | 3:37 PM

కరోనా మరణించిన వారి మృతదేహాలను ఖననం చేసుకోవడానికి బంధువులు, మిత్రులు అపోహలకు గురి కావొద్దని ఏపీ వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. కరోనాతో మృతి చెందితే నిర్భయంగా అంత్యక్రియలు చేయొచ్చని ఆయన తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కరోనా సమీక్ష అనంతరం మాట్లాడిన ఆయన.. ఒక్కో కరోనా రోగికి భోజనం కోసం రోజుకి రూ.500 చొప్పున వెచ్చిస్తున్నామని వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా లెక్క చేయకుండా కరోనా బాధితులకు ఆహారం, ఔషధాలు అందిస్తున్నామని తెలిపారు.

రోగులకు ప్రభుత్వ మెనూ అమలు చేయకపోతే చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక కరోనా రోగులకు వైద్యం నిరాకరించే ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక తూర్పు గోదావరి జిల్లాలో మరో మూడు క‌రోనా ఆసుపత్రులను పెంచ‌నున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే ఆస్ప‌త్రుల్లో బెడ్లు పెంచ‌డానికి చ‌ర్య‌లు తీసుకుంటామని వివరించారు. కాగా క‌రోనాపై మృతుల విష‌యంలో చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నార‌ని, మృతుల లెక్కలు దాచాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. రాజకీయ లబ్దికోసమే చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నార‌ని ఆళ్లనాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే కరోనాతో చనిపోతే వారి అంత్యక్రియల కోసం ప్రభుత్వం 15వేలు సాయం చేస్తోన్న విషయం తెలిసిందే.

Read This Story Also: 29 యాప్‌లను తొలగించిన గూగుల్‌

శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..