సొంతూర్లో సీఎం కేసీఆర్ పర్యటన.. ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల సాయం

తెలంగాణ సీఎం కేసీఆర్ తన సొంతూరు సిద్దిపేట రూరల్ మండలంచింతమడకలో పర్యటించారు. గ్రామస్తులు, బాల్యస్నేహితులతో ఆయన గడిపారు. తన గ్రామానికి ప్రత్యేక వరాలు కురిపించారు కేసీఆర్. ఈ సందర్భంగా జరిగిన ఆత్మీయ అనురాగ సభలో కేసీఆర్‌ ప్రసంగించారు. చింతమడకలో ప్రతి ఇంటికీ రూ. 10 లక్షల చొప్పున సాయం అందేలా ప్రత్యేక పథకాన్ని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు కేసీఆర్. గ్రామంలో ఇప్పటికే ప్రారంభించిన అభివ‌ద్ధి పనులు మూడు,నాలుగు నెలల్లో పూర్తికావాలని అధికారులను ఆదేశించారు. చింతమడక గ్రామానికి 1500 […]

సొంతూర్లో సీఎం కేసీఆర్ పర్యటన..  ప్రతి కుటుంబానికి  రూ.10 లక్షల సాయం
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 22, 2019 | 7:24 PM

తెలంగాణ సీఎం కేసీఆర్ తన సొంతూరు సిద్దిపేట రూరల్ మండలంచింతమడకలో పర్యటించారు. గ్రామస్తులు, బాల్యస్నేహితులతో ఆయన గడిపారు. తన గ్రామానికి ప్రత్యేక వరాలు కురిపించారు కేసీఆర్.

ఈ సందర్భంగా జరిగిన ఆత్మీయ అనురాగ సభలో కేసీఆర్‌ ప్రసంగించారు. చింతమడకలో ప్రతి ఇంటికీ రూ. 10 లక్షల చొప్పున సాయం అందేలా ప్రత్యేక పథకాన్ని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు కేసీఆర్. గ్రామంలో ఇప్పటికే ప్రారంభించిన అభివ‌ద్ధి పనులు మూడు,నాలుగు నెలల్లో పూర్తికావాలని అధికారులను ఆదేశించారు. చింతమడక గ్రామానికి 1500 నుంచి 2 వేల ఇళ్లు మంజూరు చేస్తామన్నారు సీఎం. అదేవిధంగా అర్హులైన వారికి మరో ఆరు నెలల్లో డుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి ఇస్తామన్నారు. రాబోయే రోజుల్లో వరినాటు యంత్రాలకు మంచి గిరాకీ ఉన్నందున ప్రజలు ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేయాలని అలాగే కోళ్ల ఫారాలు నెలకొల్పి ఉపాధి పొందాలని సూచించారు.

తన సొంతగ్రామానికి ఎంత చేసినా తక్కువేనని, అదేవిధంగా చింతమడకతో పాటు చుట్టుపక్కల గ్రామాలను కూడా అభివృద్ధి చేస్తామన్నారు సీఎం కేసీఆర్. గూడూరు, తోర్నాల, పున్నూరు గ్రామాలకు రూ. కోటి చొప్పున నిధులు మంజూరు చేయనున్నట్టుగా తెలిపారు. అలాగే దుబ్బాక పట్టణాభివృద్ధికి రూ.10 కోట్లు మంజూరు చేస్తామన్నారు. చింతమడక గ్రామాన్ని మూడు పంటలు పండే గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాక సందర్భంగా గ్రామంలో పండుగ సందడి నెలకొంది. గ్రామంలో పెద్దమ్మ దేవాలయం, శివాలయాన్ని దర్శించుకుని పూజలు చేశారు.