కేటీఆర్ చొరవ.. స్వదేశానికి తిరిగొచ్చిన 39 మంది

పొట్టకూటికోసం దేశం విడిచి సౌదీ వెళ్లిన వారికి అష్టకష్టాలు ఎదురయ్యాయి. నమ్ముకుని వెళ్లిన ఆ కంపెనీ మూతపడటం.. చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో.. వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సౌదీలోని నిర్మాణరంగ సంస్థ జేఅండ్‌పీలో పనిచేసేందుకు గత ఏడాది కరీంనగర్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు చెందిన దాదాపు 60 మంది కార్మికులు వెళ్లారు. అయితే అకస్మాత్తుగా ఆ కంపెనీ మూతపడటంతో వారంతా ఉపాది కోల్పోయారు. గత ఆరు నెలలుగా జీతాలు లేక నానావస్థలు పడ్డారు. దీంతో […]

కేటీఆర్ చొరవ.. స్వదేశానికి తిరిగొచ్చిన 39 మంది
Follow us

| Edited By:

Updated on: Jun 18, 2019 | 8:36 AM

పొట్టకూటికోసం దేశం విడిచి సౌదీ వెళ్లిన వారికి అష్టకష్టాలు ఎదురయ్యాయి. నమ్ముకుని వెళ్లిన ఆ కంపెనీ మూతపడటం.. చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోవడంతో.. వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సౌదీలోని నిర్మాణరంగ సంస్థ జేఅండ్‌పీలో పనిచేసేందుకు గత ఏడాది కరీంనగర్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు చెందిన దాదాపు 60 మంది కార్మికులు వెళ్లారు. అయితే అకస్మాత్తుగా ఆ కంపెనీ మూతపడటంతో వారంతా ఉపాది కోల్పోయారు. గత ఆరు నెలలుగా జీతాలు లేక నానావస్థలు పడ్డారు. దీంతో చేసేదేమి లేక ఆ కార్మికులు వారి సమస్యలను ట్విటర్‌ ద్వారా కేటీఆర్‌ దృష్టికి తీసుకొచ్చారు.

దీంతో రాష్ట్ర ప్రభుత్వం, సౌదీలోని భారత రాయబార కార్యాలయంకు విషయాన్ని తెలిపింది. విషయం తెలుసుకున్న తెలంగాణ ఎన్నారై శాఖ వారికి తోడుగా నిలిచింది. వారిని స్వదేశానికి పంపేదందుకు తాత్కాలిక ఎగ్జిట్ వీసాలు, విమాన టికెట్లను సమకూర్చారు. దీంతో సోమవారం రాత్రి వారంతా హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి వారిని స్వస్థలాలకు పంపే ఏర్పాట్లను ఎన్నారై శాఖ అధికారి ఇ.చిట్టిబాబు పర్యవేక్షించారు. కార్మికులను స్వదేశానికి రప్పించడానికి సహకరించిన సౌదీలోని భారత రాయబార కార్యాలయం, తెలంగాణ ఎన్నారై శాఖ అధికారులకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.