Vijayawada: నీళ్ల బాటిల్ కోసం ఇంతటి దారుణమా? చేతులు వెనక్కి విరిచి స్తంభానికి కట్టేశారు.. చివరకు

విజయవాడలోని పటమట డొంకరోడ్డులో వాటర్ బాటిల్ దొంగిలించేందుకు ప్రయత్నించాడనే అనుమానంతో ఓ వ్యక్తిని కట్టేసి.. తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటనలో బాధితుడు మృతి చెందాడు. మృతుడిని నల్గొండకు చెందిన మాస సాయికుమార్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగులు, ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Vijayawada: నీళ్ల బాటిల్ కోసం ఇంతటి దారుణమా? చేతులు వెనక్కి విరిచి స్తంభానికి కట్టేశారు.. చివరకు
Vijayawada Murder Case

Updated on: Oct 22, 2026 | 9:47 AM

వాటర్‌ కోసం వార్స్‌ జరగడం చూశాం.. కానీ, ఓ వాటర్‌ బాటిల్‌ కోసం.. మనిషి ప్రాణాలు తీసేయడం మాత్రం ఎక్కడా విని ఉండం.. అలాంటి దారుణమే విజయవాడలో జరిగింది. వాటర్‌ బాటిల్‌ దొంగిలించేందుకు ప్రయత్నించడానే అనుమానంతో… ఓ వ్యక్తిని చిత్రహింసలు పెట్టి హత్యచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చేతులు వెనక్కి విరిచి, విద్యుత్‌ స్తంభానికి కట్టేసి.. బతికుండగానే నరకం చూపి ప్రాణాలు తీశారు. ఇంతటి దారుణ కారణం ఏంటయ్యా అంటే… వాటర్ బాటిల్‌ని దొంగిలించేందుకు ప్రయత్నించడమేనని తెలుస్తోంది. విజయవాడ పటమట డొంకరోడ్డులో ఈ దారుణ ఘటన జరిగింది. దీనికి సంబంధించి నలుగురిపై హత్యకేసు నమోదు చేశారు పోలీసులు. వీరిలో ఇద్దరు ప్రైవేట్‌ ఉద్యోగులు, ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు ఉన్నారు.

మృతుడు మాస సాయికుమార్‌ (33) నల్గొండకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కొంతకాలంగా భార్య పిల్లలతో విజయవాడలో ఉంటున్న సాయికుమార్‌.. ఈ నెల 19న తెల్లవారుజామున 2 గంటలకు స్థానికంగా ఓ పాన్‌షాపు దగ్గరికెళ్లాడు. తాళం వేసి ఉన్న ఫ్రిజ్‌ నుంచి వాటర్‌ బాటిల్‌ తీసేందుకు ప్రయత్నించాడు. అప్పుడే అటుగా వచ్చిన పాలవ్యాన్‌ డ్రైవర్‌ దాన్ని గమనించి పాన్‌షాప్‌ యజమానికి సమాచారం ఇచ్చాడు. వెంటనే అక్కడికొచ్చిన రవిశంకర… సాయికుమార్‌ను మద్యంషాపు వెనక సందులోకి ఈడ్చుకెళ్లాడు. అక్కడ అయ్యప్ప అనే మరోవ్యక్తి కూడా తోడవడంతో … ఇద్దరూ కలిసి సాయికుమార్‌ చేతులను వెనక్కి విరిచి విద్యుత్‌ స్తంభానికి కట్టేసి కొట్టడం ప్రారంభించారు.

వీరికి ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు పోతంశెట్టి నవీన్‌, సాయి ప్రణీత్‌ కూడా జతకలిశారు. భార్యాపిల్లలు ఉన్నారు.. వదిలేయండి అన్న వదల్లేదు.. ఏమాత్రం కనికరం లేకుండా.. నలుగురూ కలిసి సుమారు 2గంటలసేపు దాడి చేయడంతో.. తీవ్రంగా గాయపడిన సాయికుమార్‌ అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు. ఉదయం అటుగా వచ్చిన వ్యక్తులు రక్తపు గాయాలతో పడి ఉన్న మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. మృతుడు సాయికుమార్‌గా గుర్తించిన పోలీసులు.. నలుగురిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలెట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us