Guntur district: ఇంటి ముందు చలికాచుకోవడం కూడా సేఫ్ కాదా! గుంటూరు జిల్లాలో జరిగిన ఘటన చూస్తే ఈ డౌట్ రాకమానదు. పెదకూరపాడు మండలం జలాలపురంలో ఇంటి ముందు చలి కాచుకుంటున్న బాలికపై గుర్తు తెలియని వ్యక్తులు ఎటాక్ చేశారు. తలపై గట్టిగా కొట్టారు. కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. ఆ బాలిక కేకలు వేయడంతో దుండగులు పారిపోయారు.
పెదకూరపాడు మండలం జలాలపురంలో ఆదివారం ఓ బాలిక ఇంటిముందు చలికాచుకుంటోంది. ఈ క్రమంలో బైక్ పై వచ్చిన దుండగులు.. ఇంటి ముందు చలి కాచుకుంటున్న చందనను అపహరించే ప్రయత్నం చేశారు. దీంతో ప్రతిఘటించిన బాలికపై ఇద్దరు దుండగులు దాడి చేశారు. బాలికతోపాటు ఆమె అన్న కేకలు వేయడంతో గుర్తుతెలియని దుండగులు పరారైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై పెదకూరపాడు పోలీసులు కేసు నమాదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా.. ఈ ఘటన గుంటూరు జిల్లాల్లో కలకలం రేపింది. కిడ్నాప్ యత్నం ఘటన కలకలం రేపడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిందితులను పట్టుకునేందుకు బాధితురాలి నుంచి వివరాలు సేకరించామని పోలీసులు తెలిపారు.
Also Read: