రుషికొండ తీరానికి భారత కోస్ట్ గార్డ్‌కు చెందిన 2 హోవర్ క్రాఫ్ట్‌లు.. వీటి ప్రత్యేక ఏంటో తెలుసా?

విశాఖ రుషికొండ తీరంలో భారత కోస్ట్ గార్డ్‌కు చెందిన రెండు స్వదేశీ హోవర్ క్రాఫ్ట్‌లు సందడి చేశాయి. కోస్ట్ గార్డ్ విధుల నిమిత్తం గోవా నుంచి పశ్చిమ బెంగాళ్‌ వెళ్తున్న ఈ హోవర్‌ క్రాఫ్ట్‌లు ప్రతికూల వాతావరణం వల్ల ఇంధనం నింపుకోవడానికి ఇక్కడ ఆగాయి. దీంతో నీటిపై, భూమిపై దూసుకుపోయే వీటిని చూసేందుకు సందర్శకులు భారీగా తరలివచ్చారు.

రుషికొండ తీరానికి భారత కోస్ట్ గార్డ్‌కు చెందిన 2 హోవర్ క్రాఫ్ట్‌లు.. వీటి ప్రత్యేక ఏంటో తెలుసా?
Indian Coast Guard

Edited By:

Updated on: Nov 06, 2026 | 12:34 PM

విశాఖలోని రుషికొండ తీరానికి భారత కోస్ట్ గార్డ్‌కు చెందిన రెండు అధునాతన హోవర్ క్రాఫ్ట్‌లు చేరుకున్నాయి. నీటిపై, నేలపై దూసుకుపోయే. ఈ ఓవర్ క్రాఫ్ట్‌లు సముద్రం నుంచి తీరానికి వచ్చాయి. దీంతో విశాఖ అందాలను చూసేందుకు వచ్చిన సందర్శకులు వీటిని ఆసక్తిగా చూశారు. గతంలో ఎప్పుడూ ఇటువంటి ఓవర్ క్రాఫ్ట్ లు విశాఖ తీరంలో కనిపించలేదు. కొత్త రకంగా కనిపించిన ఈ నౌకలు చూసేందుకు సందర్శకులు స్థానికులు తరలివచ్చారు.

విశాఖకు హోవర్ క్రాఫ్ట్‌లు ఎందుకు వచ్చాయి..?

ఇండియన్ నేవీ కి చెందిన ఈ అధునాతన హోవర్ క్రాఫ్ట్ లు.. కోస్ట్ గార్డ్ విధుల నిమిత్తం వెళుతున్నాయి. గోవా నుండి పశ్చిమ బెంగాల్‌కు వెళ్తున్న ఈ రక్షణ నౌకలు, తుపాను గాలులు, ప్రతికూల వాతావరణం కారణంగా.. ఇంధనం నింపుకోవడానికి తాత్కాలికంగా రుషికొండ తీరంలో ఆగాయి.

ఈ రెండు హోవర్ క్రాఫ్ట్‌లు పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినవి. ఇవి సాధారణ పడవల లాగా కాకుండా, గాలి ఒత్తిడి సహాయంతో నీటిపైనే కాకుండా ఇసుక లేదా నేలపై కూడా అత్యంత వేగంగా, సునాయాసంగా ప్రయాణించగలవు. గంటకు గరిష్టంగా 96 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఇవి.. దాదాపు 42 మంది సిబ్బందిని మోసుకెళ్లగలవు.

భారత కోస్ట్ గార్డ్ వీటిని సముద్ర తీర ప్రాంతాల్లో గస్తీ కాయడానికి, అక్రమ రవాణాను అడ్డుకోవడానికి, సముద్రంలో ప్రమాదాలు జరిగినప్పుడు రక్షణ చర్యల కోసం ఉపయోగిస్తుంది. గోవా నుండి పశ్చిమ బెంగాల్‌లోని హల్దియాకు వెళ్తున్న ఈ రెండు ప్రత్యేక నౌకలు ఇక్కడ ల్యాండ్ అవ్వడంతో, నీటిపై, ఇసుకపై ఇవి కదిలే అద్భుత దృశ్యాన్ని చూసేందుకు స్థానికులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో రుషికొండ బీచ్ వద్దకు తరలివచ్చారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us