
Andhra Pradesh: ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో విషాదం చోటు చేసుకుంది. గొల్లపల్లి రిజర్వాయర్లో పడి ఐదుగురు మహిళలు మృతి చెందారు. అయితే డ్యాంలో స్నానం చేసేందుకు ఈ ఐదుగురు మహిళలు దిగగా, ఈ విషాదం చోటు చేసుకుంది.
అయితే వారికి ఈత రాక నీటిలో ఊపిరాడక మృతి చెందినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసుల, రెస్కూ సిబ్బంది మహిళల మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనతో మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.