S V University : ఎస్వీ యూనివర్శిటీలో నల్లమందు పేలుడు, కుక్క, పంది స్పాట్ డెడ్, క్యాంపస్ లో కోలాహలం

Bomb explosion in S V University : తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీ (ఎస్వీ)లో నాటు బాంబుల కలకలం రేగింది. ఈ పేలుడు ధాటికి..

S V University : ఎస్వీ యూనివర్శిటీలో నల్లమందు పేలుడు, కుక్క, పంది స్పాట్ డెడ్, క్యాంపస్ లో కోలాహలం
Svu Campus Bomb

Updated on: Apr 01, 2021 | 11:40 AM

Bomb explosion in S V University : తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీ (ఎస్వీయూ)లో నాటు బాంబుల కలకలం రేగింది. ఈ పేలుడు ధాటికి ఒక కుక్క, పంది మృతి చెందాయి. క్యాంపస్ లోని హెచ్ బ్లాక్ దగ్గర ఈ పేలుడు జరిగింది. దీంతో హుటాహుటీన ఘటన స్థలానికి వర్సిటీ అధికారులు చేరుకొని విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు చేరవేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పేలుడు చోటుకు చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించి నల్ల మందు పేలినట్లు గుర్తించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బందితో ఆ పరిసరాలన్నీ విస్తృతంగా తనఖీలు నిర్వహిస్తున్నారు. అసలు క్యాంపస్ లోకి నల్ల మందు ఎలా వచ్చిందన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

కాగా, ఇటీవల తిరుపతిలో నాటు బాంబుల ఘటనలు తరచూ బయటపడుతున్నాయి. ఆ మధ్య చిత్తూరు, కర్నూలు జిల్లా పల్లెల్లో నాటు బాంబులు గుట్టలకు గుట్టలు దొరికాయి. ఎందుకూ అని అడిగితే అడవి పందుల కోసం అని తేల్చారు. పైగా అప్పుడు దొరికింది పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల వేళ. కానీ.. ఇప్పుడు బాంబుల కలకలం తిరుపతి నడిబొడ్డున. అదీ SV యూనివర్శిటీలో విద్యార్థులు తరచూ మసిలేచోట నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది. కానీ.. ఏం ఆశించి బాంబులు పెట్టారు. కేవలం SV వర్శిటీలోనే బాంబుల కలకలమా.. సిటీలో ఇంకా ఎక్కడైనా ఈ ఆనవాళ్లు ఉన్నాయా? ఇదే వేట కొనసాగిస్తున్నారు పోలీసులు.

Read also : AP Schools : ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు నుంచి ఒంటిపూట బడులు – విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

Loading...
Unable to load recommendations.
Follow Us