Weather Alert: చల్లని కబురు.. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. ఇదిగో 3రోజుల వెదర్ రిపోర్ట్..

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.. ఎండలు దంచికొడుతున్న వేళ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న తరుణంలో.. వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఇటు ఏపీలో.. అటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Weather Alert: చల్లని కబురు.. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. ఇదిగో 3రోజుల వెదర్ రిపోర్ట్..
Telangana Ap Weather Report

Updated on: Mar 24, 2026 | 2:34 PM

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.. ఎండలు దంచికొడుతున్న వేళ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న తరుణంలో.. వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఇటు ఏపీలో.. అటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు మెరుపులతోపాటు ఈదురు గాలులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది..

అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. దక్షిణ అంతర్గత కర్ణాటక మరియు పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో విస్తరించింది. అలాగే.. మన్నార్ గల్ఫ్ నుండి తమిళనాడు – దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు ఉన్న నిన్నటి ద్రోణి/గాలి అంతరాయం ఈ రోజు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది.

ఆంధ్రప్రదేశ్ – యానాంపై దిగువ ట్రోపో ఆవరణములో ఆగ్నేయ/నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి..

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:

మంగళవారం, బుధవారం, గురువారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్లు గరిష్టముగా 50 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

మంగళవారం, బుధవారం, గురువారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్లు గరిష్టముగా 50 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి.

రాయలసీమ :-

మంగళవారం, బుధవారం, గురువారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్లు గరిష్టముగా 50 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి

గమనిక :- ఆంధ్రప్రదేశ & యానాంలో రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 -3 డిగ్రీల సెంటీగ్రేడ్ క్రమంగా పెరిగే అవకాశముంది.

తెలంగాణ వెదర్ రిపోర్ట్..

తెలంగాణలో సైతం వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం, బుధవారం, గురువారం పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగతా ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది.

రానున్న రెండు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి నుంచి ఒకటి నుంచి రెండు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. తదుపరి నాలుగు రోజులలో క్రమేపీ రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. మూడు రోజులు ఉరుములు మెరుపులు, 30 నుండి 40 కి.మీ వేగం కలిగిన ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us