Weather Alert: బాబోయ్ ఎండలు.. వర్షాలు..! ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు.. ఇదిగో 3రోజుల వెదర్ రిపోర్ట్

Andhra Pradesh Telangana Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా ఏపీ పరిసరాలపై ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.

Weather Alert: బాబోయ్ ఎండలు.. వర్షాలు..! ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వానలు.. ఇదిగో 3రోజుల వెదర్ రిపోర్ట్
Weather Report

Updated on: Apr 03, 2026 | 3:04 PM

తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.. ఓ వైపు ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి.. మరోవైపు అక్కడక్కడ వర్షాలు సైతం కురుస్తున్నాయి.. ఈ క్రమంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దాని పరిసర ప్రాంతాలపై ఒక ఉపరితల ఆవర్తనము సగటు సముద్ర మట్టానికి 1.5 నుండి 3.1 కిలోమీటర్ల మధ్య ఎత్తులో విస్తరించి ఉన్నది.

వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి..

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది.

శనివారం, ఆదివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

శుక్రవారం, శనివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది.

ఆదివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి.

రాయలసీమ :-

శుక్రవారం, శనివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశముంది.

ఆదివారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 30-40 కిలోమీటర్లు వేగముతో వీస్తాయి.

గమనిక :- కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు లేదు.

తెలంగాణ వెదర్ రిపోర్ట్..

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. చాలా జిల్లాల్లో శుక్రవారం.. అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us