Vizag: డ్రెస్ వదులుగా కుట్టాడని.. ఎంతకు తెగించారు.. పాపం టైలర్…

దారుణ ఘటన ఇది. ఉన్మాదం మనషుల్లో ఏ స్థాయికి చేరిందో తెలియజెప్పే ఉదంతం. కుట్టిన దుస్తులు లూజ్‌గా ఉన్నాయని ముగ్గురు వ్యక్తులు కలిసి ఓ టైలర్‌ను దారుణంగా కొట్టారు.

Vizag: డ్రెస్ వదులుగా కుట్టాడని.. ఎంతకు తెగించారు.. పాపం టైలర్...
Tailor Murder

Updated on: Jan 01, 2022 | 4:07 PM

దారుణ ఘటన ఇది. ఉన్మాదం మనషుల్లో ఏ స్థాయికి చేరిందో తెలియజెప్పే ఉదంతం. కుట్టిన దుస్తులు లూజ్‌గా ఉన్నాయని ముగ్గురు వ్యక్తులు కలిసి ఓ టైలర్‌ను దారుణంగా కొట్టారు. దెబ్బలకు తాళలేక అతడు మృతి చెందాడు. మధురవాడ సమీప మారికవలస రాజీవ్‌గృహకల్ప కాలనీలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని గజపతి జిల్లా కాశీనగర్‌ తాలూకా గౌరీ గ్రామానికి చెందిన ఎల్‌.బుడు(60) మారికవలస రాజీవ్‌గృహకల్ప కాలనీ 104వ బ్లాక్‌ జీఎఫ్‌-1లో నివాసం ఉంటున్నాడు. టైలరింగ్‌ వృత్తి చేస్తూ అతను కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కాగా అదే కాలనీలో నివాసం ఉండే గణేష్‌ అనే వ్యక్తి తన బట్టలు కుట్టమని పది రోజుల క్రితం ఇచ్చాడు. కుట్టిన దుస్తులను గురువారం అతనికి అందజేయగా.. అవి బాగా లూజ్‌గా ఉన్నాయని, మళ్లీ సరిచేసి ఇప్పుడే ఇవ్వాలని గురువారం రాత్రి టైలర్‌పై గణేష్‌ ఒత్తిడి తెచ్చాడు.

తనకు రాత్రి సమయంలో కంటి చూపు తక్కువని, మరుసటి రోజు సరిచేసి ఇస్తానని టైలర్‌ చెప్పగా.. మద్యం మత్తులో ఉన్న గణేష్‌ గొడవకు దిగాడు. ఈ క్రమంలో గణేష్‌ సహా అతని బంధువులైన సూర్యనారాయణ, క్లింటన్‌ కలిసి బుడును ఇష్టమొచ్చినట్లు కొట్టారు. అపస్మారక స్థితిలోకి చేరిన బుడును ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ ఎ.రవికుమార్‌ వివరించారు. తన భర్తను కొట్టవద్దని ఎంత బతిమాలినా వినలేదని మృతుడి భార్య లక్ష్మి వివరించారు.

Also Read: Viral: సంచలనం.. ‘ప్లాస్టిక్‌ బిడ్డ’కి జన్మనిచ్చిన మహిళ.. ఇండియాలోనే
 Jagtial: డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కోసం ఆపగా.. పోలీసులకు దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన మందుబాబు
Loading...
Unable to load recommendations.
Follow Us