Sathya Sai district: కదిరి వద్ద ఆకాశంలో మిరుమిట్లు గొలుపుతూ వింత వెలుగులు.. ఏలియన్స్ ఫ్లైయింగ్ సాసర్..!

ఆకాశం వింత జరిగిందని అనంతపురం, కర్నూల జిల్లాలో ప్రచారం జరుగుతుంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి వింత చూడలేదని పబ్లిక్ చెబుతున్నారు.

Sathya Sai district: కదిరి వద్ద ఆకాశంలో మిరుమిట్లు గొలుపుతూ వింత వెలుగులు.. ఏలియన్స్ ఫ్లైయింగ్ సాసర్..!
Strange Lightning

Updated on: Dec 31, 2022 | 10:00 AM

శ్రీసత్యసాయి జిల్లాలో ఆసక్తికర ఘటన గురించి ప్రచారం జరుగుతుంది. కదిరి పట్టణంలో ఆకాశంలో వింత దృశ్యం కనిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. మిణుగురు పురుగుల తరహాలో.. ఒక దాని వెంట ఒకటి వెలుగులు చిమ్ముతూ ఆకాశంలో ప్రయాణిస్తున్న వింత ఆకారం యొక్క దృశ్యాలు వారు తమ ఫోన్లలో షూట్ చేశారు. ఇప్పటివరకు ఎప్పుడు ఆకాశంలో ఇటువంటి వింత కనిపించలేదని ఆశ్చర్యపోతున్నారు. 20 సెకన్లకే ఆ వింత వస్తువు కనిపించకుండా మాయమయ్యిందట. గ్రహాంతరవాసులు వినియోగిస్తారని ప్రచారంలో ఉన్న UFO లాంటి ఏదైనా ఫ్లైయింగ్ సాసర్ అయ్యుంటుందేమోనని స్థానికులు భావిస్తున్నారు. కాంతివంతంగా తిరిగిన వస్తువు ఏంటా అని చర్చ జరుగుతుంది. కదిరి పట్టణంలో ఆకాశంలో కనిపించిన ఆ వెలుగుల దృశ్యాల వీడియో ప్రజంట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Follow Us