ఇంటి బయట పార్క్ చేసి వదిలేసే బైకులు లేదా స్కూటర్లను నడపడానికి ముందు తప్పకుండా ఒకసారి చెక్ చేసుకోండి. లేకపోతే.. ఇలా అతిథులు అకస్మాత్తుగా వచ్చి హడలగొట్టే ప్రమాదం ఉంది. నెల్లూరు జిల్లాలో ఓ బైకు ప్యానెల్‌లోకి దూరింది. సీటు కింద ఏదో మెరుస్తూ కనిపించడంతో అప్రమత్తమైన బైకర్.. సైడ్ ప్యానెల్ తొలగించి చూసి షాకయ్యాడు.
బైకుపై వెళ్తుండగా, అకస్మాత్తుగా పాము బైకులో నుంచి చేతిపైకి వచ్చింది. అయితే అది పూర్తిగా మాత్రం బయటకు రాలేకపోయింది. దీంతో ఒక్కసారిగా బైక్ నడుపుతున్న వ్యక్తి షాక్‌కు గురయ్యాడు. బైక్‌లోకి పాము ఎలా వచ్చిందో అర్థంకాకా కంగుతిన్నాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉండగా.. స్థానికులంతా అక్కడకు చేరుకున్నారు. పామును బయటకు తీసే ప్రయత్నం చేశారు. అయితే పాము ఎంతకు బయటకు రాకపోవడంతో మెకానిక్ సహాయంతో బైక్ పార్ట్స్ అన్నీ విడదీయాల్సి వచ్చింది.
అలా..బైక్ రూపు రేఖలు మార్చిన తర్వాతే..ఆ పాము బయటకొచ్చింది. ఆ తర్వాత పామును చంపేశారు అక్కడి వ్యక్తులు. మొత్తానికి బైక్‌లో దూరిన స్నేక్ బైక్ ఓనర్‌తోపాటు, స్థానికులను ముప్పుతిప్పలు పెట్టింది.
Also Read: