Rain Alert: ఏపీ, తెలంగాణకు భారీ వర్షసూచన.. రాబోయే మూడ్రోజులు జాగ్రత్త.. వాతావరణశాఖ హెచ్చరిక ఇదే..

ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే మూడ్రోజుల్లో వానలు కురవనున్నాయి. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించడంతో పాటు బలమైన గాలులు వీచే అవకాశముంది.

Rain Alert: ఏపీ, తెలంగాణకు భారీ వర్షసూచన.. రాబోయే మూడ్రోజులు జాగ్రత్త.. వాతావరణశాఖ హెచ్చరిక ఇదే..
Rains Ap

Updated on: Aug 22, 2026 | 2:48 PM

మధ్య మయన్మార్, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ తీరాలకు దూరంగా ఉత్తర బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఎత్తుకు వెళ్ళే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉంది. దీని ప్రభావంతో రాబోయే 24 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. పశ్చిమ మధ్య, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – దక్షిణ ఒడిశా తీరాల మీదుగా సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం, పైన పేర్కొన్న ఆవర్తనంతో విలీనమైంది. వీటి ఫలితంగా ఏపీలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలను వాతావరణశాఖ జారీ చేసింది. దీని ప్రకారం ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో రాబోయే మూడ్రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిచే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. రాయలసీమలో ఈరోజు రేపు, ఎల్లుండి  తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

తెలంగాణకు రెయిన్ అలర్ట్

రుతుపవన ద్రోణి ఈరోజు సగటు సముద్ర మట్టం వద్ద అమృత్‌సర్, నజీబాబాద్, హర్దోయ్, ఈశాన్య మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న అల్పపీడన కేంద్రం, జంషెడ్‌పూర్, దీఘాల మీదుగా ప్రయాణించి, అక్కడినుండి ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వరకు వ్యాపించి ఉంది. ఇది సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో పశ్చిమ మధ్య, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం, అలాగే ఉత్తర ఆంధ్రప్రదేశ్ – దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, పశ్చిమ బెంగాల్-బంగ్లాదేశ్ తీరాలకు ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంపై ఉన్న ఉపరితల ఆవర్తనంలో విలీనమైంది. దీని ప్రభావంతో తెలంగాణలో ఈరోజు కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఈరోజు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రేపు. ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని ఉత్తర జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.  కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు మరియు గంటకు 30 నుండి 40 కి మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

Loading...
Unable to load recommendations.
Follow Us