Kuppam: కుప్పంలో పొలిటికల్ సీన్ రివర్స్.. పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్న మునిసిపల్ కౌన్సిలర్స్!

కుప్పం రాజకీయం వేగంగా మారుతోంది. అధికారం దూరమైన వెంటనే వైసీపీ కనబడకుండా పోయింది. వైసీపీ ముఖ్య నేతలంతా కుప్పం రావడానికే ముఖం చాటేస్తున్నారు. దీంతో మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది.

Kuppam: కుప్పంలో పొలిటికల్ సీన్ రివర్స్.. పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్న మునిసిపల్ కౌన్సిలర్స్!
Kuppam Tdp Chandrababu Naidu
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jul 14, 2024 | 9:41 PM

కుప్పం రాజకీయం వేగంగా మారుతోంది. అధికారం దూరమైన వెంటనే వైసీపీ కనబడకుండా పోయింది. వైసీపీ ముఖ్య నేతలంతా కుప్పం రావడానికే ముఖం చాటేస్తున్నారు. దీంతో మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది. టీడీపీలో చేరేందుకు వైసీపీ కౌన్సిలర్స్ తహతహలాడుతుందటంతో కుప్పంలో పొలిటికల్ సీన్ రివర్స్ అయ్యింది..

కుప్పం.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డా..! 1989 నుంచి చంద్రబాబును తిరుగులేని నాయకుడిగా నిలబెట్టిన నియోజకవర్గం. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు గెలిచినా, ఆ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ కుప్పంలో పట్టు కోసం ప్రయత్నం చేసింది. సత్తా చాటేందుకు సర్వశక్తులు ఒడ్డింది. ఇందులో భాగంగానే చిత్తూరు జిల్లాలో చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవా నడిచింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు భారీ మెజారిటీకి గండి కొట్టిన వైసీపీ చంద్రబాబు విజయాన్ని మాత్రం నిలువరించ లేకపోయింది. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీ పట్టు సాధించింది. కుప్పం మున్సిపాలిటీ తోపాటు అన్ని మండలాలపై పట్టు నిలుపుకుంది.

ఇదే దూకుడు 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ ప్రదర్శించాలని భావించిన వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. చంద్రబాబుకు గట్టి పోటీని ఇచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది. ఎన్నో ప్రలోభాలకు ప్రయత్నించింది. అయితే లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా క్యాంపెయిన్ చేసిన టీడీపీ కేడర్ కుప్పంలో వరుసగా చంద్రబాబుకు ఎనిమిదో విజయాన్ని అందించింది. దాదాపు 50 వేల మెజారిటీ తో కుప్పం చంద్రబాబును నాలుగో సారి సీఎంను చేసింది. దీంతో ఒక్కసారిగా కుప్పంలో పొలిటికల్ సీన్ రివర్స్ అయింది.

గత 5 ఏళ్లలో కుప్పంలో టీడీపీని ఇరుకునపెట్టేందుకు ప్రయత్నం చేసిన వైసీపీని ముప్పుతిప్పలు పెట్టేందుకు టీడీపీ శ్రేణులకు ఛాన్స్ దొరికింది. రివర్స్ గేమ్ ఆడేందుకు టీడీపీ కేడర్ కూడా సన్నద్ధం అయ్యింది. ఈ నేపథ్యంలోనే కుప్పంలో టిడిపి పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇప్పటికే వైసీపీ ముఖ్య నేతలు, సానుభూతిపరులు నెల రోజులుగా కుప్పంకు దూరంగానే ఉండటంతో రివెంజ్ పాలిటిక్స్‌కు ఇంకా పూర్తిగా తెర తీయని పరిస్థితి నెలకొంది. వైసీపీ ఓడిపోయిన తరువాత కుప్పం ముఖం చూడాలంటేనే భయపడే పరిస్థితి ఆ పార్టీ నేతలకు ఎదురైంది. కుప్పంకు రాకుండా దూరం నుంచే పరిస్థితిని అంచనా వేసుకుంటున్న వైసీపీ నేతలు సేఫ్ జోన్ లో ఉండాలని భావిస్తున్నారు. టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

ముఖ్యంగా కుప్పం మున్సిపాలిటీలోని వైసీపీ కౌన్సిలర్లు గంప గుత్తుగా టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ మేరకు టీడీపీ హై కమాండ్ ను కలిసేందుకు ఆ పార్టీ గేటు ముందు వెయిట్ చేస్తున్నారు. కుప్పం మునిసిపాలిటీ లో 25 వార్డులు ఉండగా ఆరుగురు టీడీపీ కౌన్సిలర్లు ఉండగా, 19 మంది వైసీపీ కౌన్సిలర్లు ఉన్నారు. కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ తోపాటు 11 మంది కౌన్సిలర్లు పసుపు కండువా కలుపుకునేందుకు హై కమాండ్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ, గ్రీన్ సిగ్నల్ లేకపోవడంతో వెయిటింగ్ లో ఉన్నారు. మరికొద్ది మంది టీడీపీలో చేరేందుకు అవకాశం వస్తే చాలు అనుకున్నట్లు సైకిల్ పై సవారీకి సిద్ధమైయ్యారు.

తెలుగుదేశం పార్టీ హై కమాండ్ వలసలకు తలుపులు తీస్తే పార్టీ పిర్యాయింపులకు సిద్ధంగా ఉన్న వైసీపీ కౌన్సిలర్లు, పార్టీ నేతలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు మూకుమ్మడిగా టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. అయితే గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బందులు, దాడులు, కేసులకు గురైన టీడీపీ నేతలు వైసీపీ లీడర్స్ ఎంట్రీకి బ్రేకులు వేస్తున్నారు. అధికారంలో ఉండగా కుప్పంలో టీడీపీ శ్రేణులను అన్ని విధాలా ఇబ్బంది పెట్టిన వైసీపీ నేతలను ఎట్టి పరిస్థితుల్లోనూ చేర్చుకోవద్దని హుకుం జారీ చేస్తున్నారు. ఇందులో భాగంగానే టీడీపీ వైపు చూస్తున్న కుప్పం మునిసిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ ఆసుపత్రిపై దాడి చేసి రాకను ముందుగానే అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో వైసీపీ నేతలకు టీడీపీలో ఎంట్రీకి ఛాన్స్ లేదన్న సంకేతాన్ని ఇచ్చారు.

ఇక కుప్పంలో వైసీపీ నే కనిపించకుండా చేయాలంటే ఆ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులతో పాటు నేతలకు గాలం వేసి తీరాల్సిందేనన్న ఆలోచన కూడా ఆ పార్టీలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అదే జరిగితే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు క్యూ కట్టే వైసీపీ నేతల సంఖ్యతో ఆ పార్టీ కుప్పంలో ఖాళీ అవుతుందన్న చర్చ నడుస్తోంది. ఇదే జరిగితే కుప్పంలో రివర్స్ గేమ్ తో వైసీపీ ఇరుకన పడక తప్పదేమో అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్