AP – Telangana: తెలుగు రాష్ట్రాల్లో చైల్డ్‌ పోర్నోగ్రఫీ వీడియోల కలకలం.. ఇంతకీ బాలాజీ ఎక్కడ..?

|

May 09, 2023 | 10:36 AM

చైల్డ్‌ పోర్న్‌ వీడియోల అప్‌లోడ్‌ కేసులో నిందితుడు బాలాజీ కోసం వెతుకులాట మొదలపెట్టారు పోలీసులు. బాలాజీ కోసం అన్ని జిల్లాల్లో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఎక్కడ కనిపించినా వదిలే ప్రసక్తే లేదంటున్నారు. అన్ని జిల్లాల పోలీస్‌ స్టేషన్లకు బాలాజీ ఫోటో ట్రాన్స్‌ఫర్‌ చేశారు.

AP - Telangana: తెలుగు రాష్ట్రాల్లో చైల్డ్‌ పోర్నోగ్రఫీ వీడియోల కలకలం..  ఇంతకీ బాలాజీ ఎక్కడ..?
Kalikiri Police Station
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో చైల్డ్‌ పోర్నోగ్రఫీ వీడియోలు కలకలం రేపుతున్నాయ్‌. ఏపీ సీఐడీ ఇన్వెస్టిగేషన్‌తో ఈ చైల్డ్‌ పోర్నోగ్రఫీ బయటపడింది. అన్నమయ్య జిల్లా కలికిరిలో తీగలాగితే రెండు తెలుగు రాష్ట్రాల్లో డొంక కదిలింది. ఏపీ అండ్ తెలంగాణలో అనేక ప్రాంతాల నుంచి చైల్డ్‌ పోర్నోగ్రఫీ వీడియోలు అప్‌లోడ్‌ జరుగుతున్నట్టు గుర్తించారు చిత్తూరు పోలీసులు.

ఏపీ సీఐడీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌తో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు చిత్తూరు వన్‌టౌన్‌ పోలీసులు. అయితే, పోలీసుల దర్యాప్తులో దిమ్మదిరిగే సంచలనాలు బయటపడ్డాయ్‌. ఒక్క కలికిరి నుంచే కాదు అనేక ప్రాంతాల నుంచి వీడియోలు అప్‌లోడ్‌ జరుగుతున్నట్టు గుర్తించింది. దాంతో, 32 జీరో ఎఫ్‌ఐఆర్‌లు ఫైల్‌చేసి… వాటిని ఏపీ, తెలంగాణలోని వివిధ పోలీస్‌స్టేషన్లకు ఫార్వాడ్‌ చేశారు చిత్తూరు పోలీసులు.

అన్నమయ్య జిల్లా కలికిరి కేంద్రంగా చైల్డ్‌ పోర్న్ వీడియోలు అప్‌లోడ్‌ చేసింది బాలాజీగా గుర్తించారు. లారీ డ్రైవర్ బాలాజీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఏపీలో బాలాజీ కోసం అన్ని జిల్లాల్లో పోలీసుల వెతుకులాట సాగుతుంది. అతడు ఎక్కడ కనిపించినా వదిలే ప్రసక్తే లేదంటున్నారు పోలీసులు. అన్ని జిల్లాల పోలీస్‌ స్టేషన్లకు బాలాజీ ఫోటో ట్రాన్స్‌ఫర్‌ చేశారు. చైల్డ్‌ పోర్నోగ్రఫీ విషయంలో అస్సలు ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..