PM Modi: రేపు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు.. హాజరు కానున్న ప్రధాని మోడీ

|

Jul 03, 2022 | 9:21 AM

PM Modi: ఆంధ్రప్రదేశ్‌లో అల్లూరి జయంతి వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. మన్యం వీరుడి ఆశయాలు, స్ఫూర్తిని యువతలో రగిలిస్తూ ర్యాలీలు నిర్వహిస్తోంది ప్రభుత్వం..

PM Modi: రేపు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు.. హాజరు కానున్న ప్రధాని మోడీ
Follow us on

PM Modi: ఆంధ్రప్రదేశ్‌లో అల్లూరి జయంతి వేడుకలు అంబరాన్నంటుతున్నాయి. మన్యం వీరుడి ఆశయాలు, స్ఫూర్తిని యువతలో రగిలిస్తూ ర్యాలీలు నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. స్టేడ్‌ వైడ్‌గా ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నారు. అల్లూరి జయంతి వేడుకల్లో భాగంగా నగరి నియోజకవర్గంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు మంత్రి ఆర్కే రోజా. స్వయంగా స్కూటీ నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు.

స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి పేరును ఒక జిల్లాకు పెట్టి గౌరవించడమే కాకుండా, 22 ఎకరాల్లో పెద్ద మ్యూజియాన్నే సీఎం జగన్‌ ఏర్పాటు చేస్తున్నారన్నారు మంత్రి రోజా. కేంద్రంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ఇందుకోసం సోమవారం (రేపు) మోడీ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం రానున్నారు. అక్కడ నిర్వహించే జయంతి వేడుకల్లో పాల్గొంటారు.

అణువణువునా పోలీసుల నిఘా

ఇవి కూడా చదవండి

యోగి ఆదిత్యనాథ్‌కు ఆలయ కమిటీ భాగ్యలక్ష్మి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించింది. యోగి రాక సందర్భంగా చార్మినార్ పరిసరాల్లో అణువణువునా పోలీసులు నిఘా పెట్టారు. భాగ్య లక్ష్మి టెంపుల్ చుట్టూ 500 మీటర్ల రేడియస్‌లో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. రూట్ టాప్ భద్రతను సౌత్ జోన్ పోలీసులు పటిష్టం చేశారు. మొత్తం 350మంది పోలీస్‌లతో చార్మినార్ భాగ్యలక్ష్మి లాడ్ బజార్, సర్దార్ మహల్ చూట్టూ భద్రతను ఏర్పాటు చేశారు. కాగా, భాగ్యలక్ష్మి దేవాలయం ఎంట్రీ అండ్ ఎగ్జిట్‌ను ఎస్పీజీ కమాండోస్ తమ అధీనంలోకి తీసుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి