Andhra: అంతటా ఎండలతో అల్లాడిపోతుంటే.. ఏపీలోని ఈ ప్రాంతంలో మాత్రం పొగమంచు సోయగాలు

ఎల్ నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్నప్పటికీ, అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో శీతాకాల వాతావరణం నెలకొంది. గత మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గి, ఉదయం వేళ దట్టమైన పొగమంచు కమ్మేస్తోంది. 18 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలతో ఆహ్లాదకరమైన వాతావరణం పర్యాటకులను, ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తోంది.

Andhra: అంతటా ఎండలతో అల్లాడిపోతుంటే.. ఏపీలోని ఈ ప్రాంతంలో మాత్రం పొగమంచు సోయగాలు
Paderu Agency Weather

Updated on: Oct 01, 2026 | 1:37 PM

ఎల్ నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎండలు మండుతుంటే, అల్లూరి జిల్లాలోని పాడేరు ఏజెన్సీ మాత్రం చల్లటి, ఆహ్లాదకరమైన వాతావరణంతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గత మూడు రోజులుగా ఏజెన్సీ పరిధిలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా ఉదయం వేళ దట్టమైన పొగమంచు దుప్పటిలా కమ్మేసి, ప్రకృతి ప్రేమికులకు మధురానుభూతిని పంచుతోంది. గత వారం వర్షాలతో అతలాకుతలమైన అల్లూరి జిల్లాలో ప్రస్తుతం కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో ప్రస్తుతం కనిష్టంగా 18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. పగటిపూట ఉష్ణోగ్రతలు కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ, రాత్రివేళల్లో చలి పెరుగుతోంది. ఉదయానికి శ్వేతమయమైన పొగమంచు దట్టంగా వ్యాపించి కనువిందు చేస్తోంది.

అక్టోబరు నుంచి జనవరి వరకు ఇలాంటి వాతావరణం పర్యాటకులను, ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తుందని అంచనా. ఇప్పటికే వంజంగి, లంబసింగి, అరకు వ్యాలీ, మాడగడ వ్యూ పాయింట్లు పర్యాటకులతో కిటకిటలాడేందుకు సిద్ధమవుతున్నాయి. ఉదయం దట్టమైన పొగమంచు కారణంగా వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం ఎనిమిది గంటలు దాటినా పాడేరు చుట్టుపక్కల ప్రాంతాలు పొగమంచుతో కప్పబడి ఉన్నాయి. మరీ జనాలు లేకుండా.. ప్రశాంతంగా.. మన ఏజెన్సీ అందాలను చూడాలంటే ఇదే కరెక్ట్ టైం.

Loading...
Unable to load recommendations.
Follow Us