Chandrababu: టీడీఎల్పీ నేతగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నిక

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరనుంది. జూన్‌ 12న రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం విజయవాడలో కూటమి నేతలు సమావేశం అయ్యారు. విజయవాడ ఏ-కన్వెన్షన్‌ సెంటర్‌లో మూడు పార్టీల ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. టీడీఎల్పీ నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అచ్చెన్నాయుడు ప్రకటించారు...

Chandrababu: టీడీఎల్పీ నేతగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నిక
Chandrababu

Updated on: Jun 11, 2024 | 12:00 PM

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరనుంది. జూన్‌ 12న రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం విజయవాడలో కూటమి నేతలు సమావేశం అయ్యారు. విజయవాడ ఏ-కన్వెన్షన్‌ సెంటర్‌లో మూడు పార్టీల ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. టీడీఎల్పీ నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అచ్చెన్నాయుడు ప్రకటించారు.

కాగా, అనంతరం శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో కూటమి నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చంద్రబాబు, పవన్‌, పురందేశ్వరి, కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అనంతరం చంద్రబాబును శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నట్లు.. గవర్నర్‌కు కూటమి పక్షాల నేతలు లేఖ ఇవ్వనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు.. సాయంత్రానికల్లా చంద్రబాబును గవర్నర్ ఆహ్వానించనున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us