
టీ 20 వరల్డ్ కప్‌లో భాగంగా జరిగిన భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ విదేశాలకు వెళ్లడంపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పించిన విషయం అందిరికి తెలిసిందే. తాజాగా దీనిపై మంత్రి నారా లోకేష్ మరోసారి చిట్‌చాట్ ద్వాకా స్పందించారు. టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా ఫైనల్‌కు వస్తే మళ్లీ మ్యాచ్ చూడడానికి వెళ్తానని అన్నారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ వస్తానంటే ఆయనకు కూడా టికెట్ తీసి మ్యాచ్ చూపిస్తానన్నారు. నాకు దేశ భక్తి ఉంది, నేను వెళ్తా అని చెప్పుకొచ్చారు.
అలాగే హెరిటేజ్ విషయంపై కూడా ఆయన మాట్లాడారు. హెరిటేజ్‌కు ఇందపూర్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. పన్నీర్, చీజ్ తయారీలో మాత్రమే హెరిటేజ్–ఇందపూర్ కలిసి పనిచేస్తున్నాయని వివరణ ఇచ్చారు. వ్యాపార భాగస్వామ్యాన్ని తప్పుగా అర్థం చేసుకొంటున్నారని..
హెరిటేజ్ సంస్థకు ప్రభుత్వానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. హెరిటేజ్ లిస్టెడ్ కంపెనీ? అని సీనియర్ లీడర్ బొత్స కు కో పార్టనర్ కు, కో మాన్యుఫాక్చరర్ కు తేడా తెలియకపోవడం దారుణమన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.