చల్లబడిన వాతావరణం.. గురువారం ఏపీలో వెదర్ ఎలా ఉంటుంది..? లేటెస్ట్ రిపోర్ట్ ఇదిగో

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా చురుకుగా మారుతున్న నేపథ్యంలో అమరావతి వాతావరణ కేంద్రం కీలక వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు-మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది.

చల్లబడిన వాతావరణం.. గురువారం ఏపీలో వెదర్ ఎలా ఉంటుంది..? లేటెస్ట్ రిపోర్ట్ ఇదిగో
Rain Alert

Updated on: Jun 03, 2026 | 5:52 PM

తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణం నెలకొంది. రుతుపవనాలు చురుకుగా మారుతుండటంతో ఎండలతోపాటు.. వర్షాలు కూడా కురుస్తున్నాయి.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులపై అమరావతి వాతావరణ కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చింది.. రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి పయనం, 10° ఉత్తర అక్షాంశం /60° తూర్పు రేఖాంశం, 9° ఉత్తర అక్షాంశం /65° తూర్పు రేఖాంశం, 8.5° ఉత్తర అక్షాంశం /70° తూర్పు రేఖాంశం, 8° ఉత్తర అక్షాంశం /75° తూర్పు రేఖాంశం, 7.8° ఉత్తర అక్షాంశం /78° తూర్పు రేఖాంశం, 8° ఉత్తర అక్షాంశం /80° తూర్పు రేఖాంశం, 10°ఉత్తర అక్షాంశం/80° తూర్పు రేఖాంశం ,13° ఉత్తర అక్షాంశం /87° తూర్పు రేఖాంశం, 16° ఉత్తర అక్షాంశం /90° తూర్పు రేఖాంశం19° ఉత్తర అక్షాంశం /93° తూర్పు రేఖాంశం 22° ఉత్తర అక్షాంశం /97° తూర్పు రేఖాంశం గుండా కొనసాగుతోంది.

జూన్ 4వ తేదీ నాటికి, నైరుతి రుతుపవనాలు నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్ దీవులు, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు, నైరుతి, పశ్చిమ-మధ్య, తూర్పు-మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలలోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.

పశ్చిమ ఉత్తర ప్రదేశ్ మీదుగా ఉన్న ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి మధ్యప్రదేశ్, విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉత్తర తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి విస్తరించి ఉంది.

తూర్పు మధ్యప్రదేశ్, దానిని ఆనుకుని ఉన్న ఛత్తీస్‌గఢ్ మీదుగా ఉన్న ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి, విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఈశాన్య తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ఉన్ననిన్నటి ద్రోణి ఈరోజు బలహీనపడింది.

వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం:

బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 50 -60 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

గురువారం, శుక్రవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-

బుధవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 50 -60 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

గురువారం, శుక్రవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

రాయలసీమ :-

బుధవారం, గురువారం, శుక్రవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

గమనిక ;- కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం – రాయలసీమ ప్రాంతాలలో రాబోయే 5 రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతల నమోదులో పెద్దగా మార్పు లేదు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us