Viral Video: రోడ్డుపై కొండముచ్చు హల్‌చల్.. అధికారులకు ముప్పుతిప్పలు.. చివరికి..!

|

Aug 17, 2021 | 3:10 PM

సోషల్ మీడియాలో కోతులు, కొండముచ్చులకు సంబంధించిన వీడియోలు తెగ హల్చల్ చేస్తుంటాయి. అవి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటాయి..

Viral Video: రోడ్డుపై కొండముచ్చు హల్‌చల్.. అధికారులకు ముప్పుతిప్పలు.. చివరికి..!
Monkey
Follow us on

సోషల్ మీడియాలో కోతులు, కొండముచ్చులకు సంబంధించిన వీడియోలు తెగ హల్చల్ చేస్తుంటాయి. అవి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటాయి. క్షణాల్లో వైరల్‌గా మారుతాయి. అలాంటి ఓ వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

సాధారణంగా కోతులు, కొండముచ్చులు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఒక్క చెట్టుపై నుంచి మరో చెట్టుకు.. అలాగే ఒక బిల్డింగ్ మీద నుంచి మరోదానిపైకి ఎక్కుతూ.. దిగుతూ తెగ హల్చల్ చేస్తుంటాయి. అవి చేసే చర్యలు కొన్నిసార్లు ప్రజలకు ఇబ్బందులు కలిగించినా.. వాటి చేష్టలు, చర్యలు చూడటానికి మాత్రం ఆహ్లాదకరంగా ఉంటాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి గుంటూరు సిటీలో చోటు చేసుకుంది. ఓ కొండముచ్చు రోడ్డుపై హల్చల్ చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు నగరంలోని నగరంపాలెం మూడు బొమ్మల సెంటర్‌ వద్ద ఓ కొండముచ్చు హల్చల్ చేసింది. రోడ్డుపై వెళ్తున్న ప్రతీ ఆటోను ఆపి.. ఎక్కుతూ తెగ సందడి చేసింది. స్థానికులు దాన్ని శాంతింపజేసేందుకు తినడానికి ఆహారాన్ని ఇచ్చినా.. దాని హడావుడికి హద్దు లేకుండా పోయింది. అక్కడ కొండముచ్చు కారణంగా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీనితో కొంతమంది వాహనదారులు అటవీశాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు. వారు సంఘటనాస్థలానికి చేరుకొని కొండముచ్చును వలవేసి పట్టుకున్నారు. కాగా, దీంతో స్థానికులు, వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.