Ganta: పవన్ మాట నిజమైంది.. వచ్చే ఎన్నికల్లో టీడీపీదే విజయం.. గంటా సెన్సేషనల్ కామెంట్స్

వాయిస్ పెంచారు టీడీపీ ఎమ్మెల్యే గంటా. ఇన్నాళ్లూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆయన ఇప్పుడు ప్రభుత్వంపై సీరియస్ కామెంట్స్ చేస్తూ క్యాడర్‌లో జోష్ పెంచుతున్నారు.

Ganta: పవన్ మాట నిజమైంది.. వచ్చే ఎన్నికల్లో టీడీపీదే విజయం.. గంటా సెన్సేషనల్ కామెంట్స్
MLA Ganta Srinivasa Rao

Updated on: Mar 17, 2023 | 11:24 AM

గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను విజయపథాన నిలిపిన గ్రాడ్యుయేట్‌ ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. తాము ఎక్కడా డబ్బులు, కానుకలు పంచలేదని స్పష్టం చేశారు. ఆరునెలల ముందే అభ్యర్థి పేరును వైసీపీ ప్రకటించిన విషయాన్ని గంటా ప్రస్తావించారు. తమ అభ్యర్థిని ఫిబ్రవరి ఒకటిన ప్రకటించామని అన్నారు. ఈ ఎన్నికలు ప్రభుత్వానికి చెంపపెట్టని గంటా అన్నారు. రాబోయే రోజుల్లో ఇదే ధోరణి కొనసాగుతుందని తెలిపారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలని పవన్‌ కల్యాణ్‌ చెప్పిన విషయం ఈ ఎన్నికల్లో రుజువైందని గంటా విశ్లేషించారు. రాజధాని వ్యవహారం సహా వైసీపీ చెప్పిన మాటలకు ప్రజల్లో విశ్వాసం లభించలేదన్నారు. మూడేళ్ల క్రితం దాదాపు 50 ఓటింగ్ సాధించిన వైసీపీ ఇప్పుడు 30శాతంకు పడిపోయిందన్నారు. ఈ ఒరవడి వచ్చే ఎన్నికలకు నాంది అని.. 2024లో టీడీపీదే విజయన్నారు గంటా.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us