Chiru Join in Janasena : మళ్ళీ రాజకీయాల వైపు చూస్తున్న మెగాస్టార్ .. తమ్ముడు పవన్ కళ్యాణ్ కు అండగా అన్న చిరంజీవి …

మెగా అభిమానులకు జనసేన కార్తకర్తలకు నాదెండ్ల్ మనోహర్ శుభవార్త చెప్పారు.. తమ్ముడు వెంట అన్న త్వరలో నడవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.. జనసేన పార్టీలోకి మెగాస్టార్ చిరంజీవి అడుగు పెట్టబోతున్నారని అధికారికంగా...

  • Surya Kala
  • Publish Date - 2:17 pm, Wed, 27 January 21
Chiru Join in Janasena : మళ్ళీ రాజకీయాల వైపు చూస్తున్న మెగాస్టార్ .. తమ్ముడు పవన్ కళ్యాణ్ కు అండగా అన్న చిరంజీవి ...

Chiru Join in Janasena : జనసేన పార్టీలోకి మెగాస్టార్ చిరంజీవి అడుగు పెట్టబోతున్నారని అధికారికంగా ఆ పార్టీ క్రియాశీలక నేత నాదెండ్ల మనోహర్ కన్ఫామ్ చేశారు. ఈరోజు నిర్వహించిన జనసేన క్రియాశీలక సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వెంట త్వరలో చిరంజీవి నడవబోతున్నారని చెప్పారు. ఈ మేరకు తమ్ముడికి అండగా ఉంటానని చిరంజీవి స్పష్టమైన హామీ ఇచ్చారని తెలిపారు మనోహర్.

ఈ సమావేశంలో వైసిపీ ప్రభుత్వం పై మనోహర్ తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని చెప్పారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని.. చెప్పారు. అంతేకాదు పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకొండని ప్రభుత్యం బెదిరిస్తుందని ఆయన ఆరోపించారు. జనసేన ఏకగ్రీవాలకు విరుద్ధమని ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరగాలని అన్నారు.. స్వచ్ఛమైన రాజకీయాల కోసం యువత రావాలంటే.. పంచాయతీ ఎన్నికల్లో యువత నిలవాలని చెప్పారు నాదెండ్ల.

మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి అనంతరం ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు.. రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర పర్యాటక మంత్రిగా పదవిని నిర్వహించారు.. గత కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిరంజీవి తాజాగా తమ్ముడు పెట్టిన జనసేన పార్టీలో చేరనున్నారని వార్త అటు అభిమానుల్లోనూ ఇటు కార్యకర్తల్లోనూ సంతోషం నింపుతుంది.. ఇప్పటికే నాగబాబు జనసేన పార్ట్ తరఫున ఎంపీ గా పోటీచేసిన సంగతి తెల్సిందే.

Also Read: పాకిస్తాన్ పూజలందుకుంటున్న పంచముఖి అంజనేయస్వామి.. 1500 ఏళ్ల నాటి ఆలయానికి తగ్గని ఆదరణ