Weather Alert: వచ్చేశాయ్‌రా బుల్లోడా.. ఇక నాన్‌స్టాప్ వర్షాలే వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో జోరు వానలు

నైరుతి రుతు పవనాల కారణంగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.. దీంతోపాటు.. వాయుగుండం ప్రభావం కూడాకనిపిస్తోంది.. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక ప్రకటన జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయని.. దీంతో జోరు వానలు కురుస్తాయని తెలిపింది.

Weather Alert: వచ్చేశాయ్‌రా బుల్లోడా.. ఇక నాన్‌స్టాప్ వర్షాలే వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో జోరు వానలు
Rain Alert

Updated on: May 31, 2025 | 10:48 AM

నైరుతి రుతు పవనాల కారణంగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.. దీంతోపాటు.. వాయుగుండం ప్రభావం కూడాకనిపిస్తోంది.. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక ప్రకటన జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయని తెలిపింది. రుతుపవనాల రాకతో జూన్ రెండోవారం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనావేసింది. రుతుపవనాలు విస్తరిస్తుండటంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు మరో వారం కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది.

రుతుపవనాల ప్రభావంతో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం చెప్పింది.. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో మేఘావృత వాతావరణంతో పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, వైఎస్ఆర్ కడప, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, భూపాలపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో వర్షాలు కురుస్తాయిన వాతావరణ కేంద్రం చెప్పింది. గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us