గుడ్ న్యూస్.. కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు డీజీసీఏ అనుమతులు.. త్వరలోనే విమాన సర్వీసులు ప్రారంభం..

Kurnool Airport News: కర్నూలు ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. ఓర్వకల్ విమానాశ్రయానికి డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్...

  • Ravi Kiran
  • Publish Date - 10:35 am, Sun, 17 January 21
గుడ్ న్యూస్.. కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు డీజీసీఏ అనుమతులు.. త్వరలోనే విమాన సర్వీసులు ప్రారంభం..

Kurnool Airport News: కర్నూలు ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. ఓర్వకల్ విమానాశ్రయానికి డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) మార్చి నుంచి విమాన రాకపోకలకు అనుమతులు మంజూరు చేస్తూ జనవరి 15న ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉంటే గతేడాది మార్చిలోనే కర్నూలు విమానాశ్రయం పనులను వేగవంతం పూర్తి చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే.

దీనితో త్వరితగతిన పనులన్నీ పూర్తి అయ్యాయి. ఈ క్రమంలోనే కర్నూలులో విమానాశ్రయం అందుబాటులోకి వస్తుండటంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ది పరుగులు పెట్టడంతో పాటు ఉద్యోగావకాశాలు మెండుగా ఉంటాయని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. అలాగే ఇటీవల ఢిల్లీ నుంచి వచ్చిన డీజీసీఏ బృందం కర్నూలు ఎయిర్‌పోర్టును పరిశీలించిన సంగతి తెలిసిందే. విమానాశ్రయంలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్న తర్వాత డీజీసీఏ అనుమతులు మంజూరు చేసింది.

Also Read: ఆ రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్‌కు బ్రేకులు.. అసలు కారణమిదే.!