MLC నాగబాబుకు ఏపీ సర్కార్ కీలక పదవి.. ఏకంగా కేబినెట్ ర్యాంక్..

ఏపీ గ్రీన్‌ (AP-GREEN) ఎగ్జిక్యూటివ్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు పర్యావరణ, అటవీ శాఖ జీవోఆర్టీ నంబర్‌ 93 జారీ చేసింది. 2047 నాటికి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అటవీ, చెట్ల కవరేజీని 50 శాతానికి పెంచడం ఏపీ గ్రీన్‌ ప్రధాన లక్ష్యం. ఎగ్జిక్యూటివ్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా నాగబాబుకు కేబినెట్‌ ర్యాంక్‌ హోదాను ప్రభుత్వం కల్పించింది.

MLC నాగబాబుకు ఏపీ సర్కార్ కీలక పదవి.. ఏకంగా కేబినెట్ ర్యాంక్..
Pawan Kalyan - Nagababu

Updated on: Aug 17, 2026 | 12:10 PM

ఆంధ్రప్రదేశ్‌లో పచ్చదనం పెంపు, అటవీ విస్తీర్ణాన్ని పెంచే లక్ష్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ గ్రీన్‌ (AP-GREEN) ఎగ్జిక్యూటివ్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా పవన్ కల్యాణ్ సోదరుడు, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు(నాగేంద్రరావు)ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు పర్యావరణ, అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోఆర్టీ నంబర్‌ 93 ప్రకారం.. ఏపీ గ్రీన్‌ సొసైటీని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు గవర్నింగ్‌ బోర్డు, ఎగ్జిక్యూటివ్‌ కమిటీతో పాటు జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్‌ గ్రీన్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీల (DGDA) పాలక మండళ్లను ఏర్పాటు చేసింది.

2047 నాటికి 50 శాతం గ్రీన్‌ కవర్‌ లక్ష్యం

రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో ప్రస్తుతం ఉన్న అటవీ, చెట్ల కవరేజీని 2047 నాటికి 50 శాతానికి పెంచడం ఏపీ గ్రీన్‌ ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. పచ్చదనం పెంపు, అటవీ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను సమన్వయంతో అమలు చేయడంపై ఈ సంస్థ ప్రధానంగా దృష్టి సారించనుంది.

ఎగ్జిక్యూటివ్‌ కమిటీకి నాగబాబు

ప్రభుత్వం ఆమోదించిన ఏపీ గ్రీన్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ కూర్పు ప్రకారం.. ప్రభుత్వం నామినేట్‌ చేసే చైర్‌పర్సన్‌ ఆధ్వర్యంలో కమిటీ పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు ఎగ్జిక్యూటివ్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా ప్రభుత్వం నియమించింది. ఏపీ గ్రీన్‌ లక్ష్యాలు, కార్యకలాపాల అమలులో సమన్వయం తీసుకురావడంతో పాటు.. కార్యక్రమాల పురోగతిని పర్యవేక్షించే బాధ్యతలను ఆయన నిర్వహించనున్నారు.

కేబినెట్‌ ర్యాంక్‌ హోదా

ఎగ్జిక్యూటివ్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా నియమితులైన నాగబాబుకు ప్రభుత్వం కేబినెట్‌ ర్యాంక్‌ హోదా కల్పించింది. ఈ హోదా ఆయన పదవిలో కొనసాగుతున్న కాలంలో వర్తించే నిబంధనలు, షరతులకు లోబడి ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

రాష్ట్రంలో పచ్చదనం పెంపు, అటవీ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడంలో ఏపీ గ్రీన్‌ కీలక పాత్ర పోషించనుంది. జిల్లా స్థాయిలోని గ్రీన్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఎగ్జిక్యూటివ్‌ కమిటీపై ఉండనుంది.

ఆంధ్రప్రదేశ్‌ గ్రీన్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ అంటే ఏమిటి?

ఆంధ్రప్రదేశ్‌లో పచ్చదనాన్ని పెంచడం, అడవులను అభివృద్ధి చేయడం, చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవస్థలో కీలక భాగమే ఆంధ్రప్రదేశ్‌ గ్రీన్‌ కార్యనిర్వాహక కమిటీ. సులభంగా చెప్పాలంటే.. రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, అటవీ విస్తరణకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అమలు చేయడం, సమన్వయం చేయడం, పర్యవేక్షించడం ఈ కమిటీ ప్రధాన బాధ్యత.

Loading...
Unable to load recommendations.
Follow Us