Watch Video: సాక్షాత్తు పరమశివుడే దర్శనమిచ్చాడు.. శివలింగాన్ని చుట్టుకున్న నాగుపాము.. అరుదైన వీడియో..

నంద్యాల జిల్లా శ్రీశైలంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది.. సాక్షాత్తూ పరమశివుడే దర్శనమిచ్చాడంటూ భక్తులు భక్తిపారవశ్యంలో మునిగితేలారు.. అసలేం జరిగిందంటే.. శివుడికి ఇష్టమైన రోజు సోమవారం కావడం.. అదేరోజు శ్రీశైలంలోని ఓ గుడిలోనున్న శివలింగానికి ఓ నాగుపాము చుట్టుకుని కనిపించింది.. దీంతో భక్తులు భక్తిభావంతో పరవశించారు.

Watch Video: సాక్షాత్తు పరమశివుడే దర్శనమిచ్చాడు.. శివలింగాన్ని చుట్టుకున్న నాగుపాము.. అరుదైన వీడియో..
King Cobra Coiled Around Shiva Lingam
Follow us

|

Updated on: Jul 17, 2024 | 11:10 AM

నంద్యాల జిల్లా శ్రీశైలంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది.. సాక్షాత్తూ పరమశివుడే దర్శనమిచ్చాడంటూ భక్తులు భక్తిపారవశ్యంలో మునిగితేలారు.. అసలేం జరిగిందంటే.. శివుడికి ఇష్టమైన రోజు సోమవారం కావడం.. అదేరోజు శ్రీశైలంలోని ఓ గుడిలోనున్న శివలింగానికి ఓ నాగుపాము చుట్టుకుని కనిపించింది.. దీంతో భక్తులు భక్తిభావంతో పరవశించారు. శ్రీశైలం మహాక్షేత్రంలోని పాతాళగంగకు వెళ్లె నడకదారి రోడ్డు మార్గంలోని కొండ పక్కన ఉన్న వజ్రాల గంగమ్మ గుడి వెనుక ఉన్న చిన్న గుడిలోని శివలింగానికి నాగుపాము చుట్టుకుని ఉన్న దృశ్యాన్ని అటుగా వెళుతున్న భక్తులు చూసి ఆశ్చర్యానికి గురయ్యారు.

శివలింగానికి నాగుపాము చుట్టుకుని ఉండటంతో భక్తులు ఒక్కసారిగా భక్తి భావంతో దర్శించుకున్నారు. ఈ ఆలయం శ్రీశైలం అటవీ ప్రాంతంలో ఉంది. అయితే పాతాళగంగ పుణ్యస్నానాలకు నడకమార్గంలో వెళ్లాలంటే ఈ దారిలోనే వెళ్లాలి. దీంతో భక్తులు చుట్టుపక్కల ఉన్న ఆలయాలను దర్శించుకుంటూ వెళుతుంటారు.

వీడియో చూడండి..

ఈ క్రమంలోనే కొందరు భక్తులు వజ్రాల గంగమ్మ గుడి దర్శనానికి వెళ్లి పక్కనే ఉన్న శివలింగానికి పూజలు చేసుకునేందుకు వెళ్లిన క్రమంలో.. ఈ అరుదైన దర్శనం కలగటంతో భక్తులు భక్తి పారవశ్యంలో మునిగితేలారు..

వీడియో చూడండి..

భక్తి భావంతో దర్శించుకుని.. తమ కొర్కెలు తీరాలంటూ మొక్కుకున్నారు. ఈ అరుదైన దృశ్యం దర్శనాన్ని భక్తులు అదృష్టంగా భావించారు.. కొందరు భక్తులు ఈ అరుదైన దృశ్యాన్ని సెల్ ఫోన్లలో చిత్రీకరించారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఇతడే? సెమీ ఆటోమేటిక్‌ గన్‌తో కాల్పులు
ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఇతడే? సెమీ ఆటోమేటిక్‌ గన్‌తో కాల్పులు
పూరీ రత్నభాండాగారంలో విష సర్పాల రక్షణలో మరో రహస్య గది.! వీడియో..
పూరీ రత్నభాండాగారంలో విష సర్పాల రక్షణలో మరో రహస్య గది.! వీడియో..
గాల్లోనే పేలిపోయిన స్పేస్ ఎక్స్ రాకెట్‌.! తప్పుడు కక్ష్యలోకి..
గాల్లోనే పేలిపోయిన స్పేస్ ఎక్స్ రాకెట్‌.! తప్పుడు కక్ష్యలోకి..
నాగబంధనం అంటే ఏంటి.? ఎందుకు వేస్తారు.? దాని పవర్ ఎంత.? వీడియో..
నాగబంధనం అంటే ఏంటి.? ఎందుకు వేస్తారు.? దాని పవర్ ఎంత.? వీడియో..
బ్యాంకర్‌ స్థాయి ఉద్యోగం నుంచి కోటీశ్వరురాలైన నిశ్చా షా.!
బ్యాంకర్‌ స్థాయి ఉద్యోగం నుంచి కోటీశ్వరురాలైన నిశ్చా షా.!
కోడలిపై కెప్టెన్ అన్షుమాన్ పేరెంట్స్ ఆరోపణలు.. వీడియో.
కోడలిపై కెప్టెన్ అన్షుమాన్ పేరెంట్స్ ఆరోపణలు.. వీడియో.
ఇంట్లోకి దూసుకొచ్చిన బుల్లెట్.. నార్సింగిలోని అపార్ట్‌మెంట్‌లో..
ఇంట్లోకి దూసుకొచ్చిన బుల్లెట్.. నార్సింగిలోని అపార్ట్‌మెంట్‌లో..
నీతా అంబానీ వెంట తెచ్చిన దీపం స్టోరీ తెలుసా.? పెళ్ళిలో హైలెట్..
నీతా అంబానీ వెంట తెచ్చిన దీపం స్టోరీ తెలుసా.? పెళ్ళిలో హైలెట్..
గంపలో వేపాకు .. దానిపైన కప్ప.! వర్షాలకోసం కప్పలకు పెళ్లి..
గంపలో వేపాకు .. దానిపైన కప్ప.! వర్షాలకోసం కప్పలకు పెళ్లి..
సీసీ కెమెరాల్లో రికార్డయిన విమాన ప్రమాద దృశ్యాలు.! తోక భాగం నేలపై
సీసీ కెమెరాల్లో రికార్డయిన విమాన ప్రమాద దృశ్యాలు.! తోక భాగం నేలపై