Andhra Pradesh: చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన పవన్‌ కళ్యాణ్‌.. ఏమన్నారంటే

|

Sep 09, 2023 | 12:10 PM

ప్రాథమిక ఆధారాలను చూపించకుండా అర్థరాత్రి అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. గతంలో విశాఖపట్నంలో జనసేన పట్ల ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని పవన్‌ గుర్తు చేశారు. ఏ తప్పూ చేయని నాయకులపై మర్డర్ కేసులు పెట్టీ జైళ్లకు నెడుతున్నారంటూ విమర్శించారు. చంద్రబాబు అరెస్టు తీవ్రంగా ఖండిస్తునాన్న పవన్ కళ్యాణ్‌.. పాలన పరంగా అనుభవం ఉన్నా వ్యక్తి పట్ల ప్రభుత్వ తీరు సరైంది కాదన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అంశంలో ప్రభుత్వం పోలీసులు..

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ స్పందించారు. ప్రాథమిక ఆధారాలను చూపించకుండా అర్థరాత్రి అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. గతంలో విశాఖపట్నంలో జనసేన పట్ల ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని పవన్‌ గుర్తు చేశారు. ఏ తప్పూ చేయని నాయకులపై మర్డర్ కేసులు పెట్టీ జైళ్లకు నెడుతున్నారంటూ విమర్శించారు. చంద్రబాబు అరెస్టు తీవ్రంగా ఖండిస్తునాన్న పవన్ కళ్యాణ్‌.. పాలన పరంగా అనుభవం ఉన్నా వ్యక్తి పట్ల ప్రభుత్వ తీరు సరైంది కాదన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అంశంలో ప్రభుత్వం పోలీసులు అందరి పట్ల ఒకలా ఉండాలని పవన్ హితవు పలికారు.

అరెస్టుపై నిరసన తెలిపితే హౌస్ అరెస్టులు చేస్తారా అంటూ ప్రశ్నించారు. అక్రమాలు చేసిన జై వెళ్ళిన వాళ్ళు విదేశాలకు వెల్లోచ్చు కానీ చంద్రబాబు మద్దతుగా నిరసనలు తెలిపితే తప్పా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్ లా అండ్ ఆర్డర్ అంశం కాదూ పూర్తిగా ఇధి కక్ష సాధింపు చర్యేనని అన్నారు. చంద్రబాబుకు అండగా ఉంటా మద్దతు తెలుపుతున్నాని పవన్ స్పష్టం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published on: Sep 09, 2023 12:08 PM