
సోషల్ మీడియా పరిచయాలు ప్రాణాంతకంగా మారుతున్నాయనడానికి నిదర్శనం ఈ ఘటన.. సోషల్ మీడియా ప్లాట్ఫాం ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ యువతి మాటలు నమ్మి వచ్చిన యువకుడిని.. పక్కా స్కెచ్ తో కిడ్నాప్ చేశారు.. నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి హత్యాయత్నం చేశారు. విశాఖపట్నంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ మొత్తం వ్యవహారానికి.. ఓ యువతి కోసం మొదలైన వివాదమే కారణం.. ఒక యువతి కోసం ఇద్దరు యువకుల మధ్య చలరేగిన వివాదంతో కక్ష కట్టిన ఓ యువకుడు.. మరో యువకుడిపై కక్ష తీర్చుకునేందుకు ఇంకో యువతిని నిందితుడు రంగంలోకి దింపి ఇన్ స్టా ద్వారా ట్రాప్ చేయించడం విశేషం.. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా జామి మండలం అలమండ గ్రామానికి చెందిన యోగేంద్ర భాస్కర్ బాలాజీ అనే యువకుడికి గతంలో ఇనాగ్రామ్ ద్వారా ఓ యువతి పరిచయమైంది. అయితే.. అప్పటికే ఆ యువతికి ప్రణీత్ అనే యువకుడితో పరిచయముంది. భాస్కర్ బాలాజీతో యువతికి పరిచయమున్న విషయం తెలుసుకున్న ప్రణీత్.. కోపం పెంచుకున్నాడు. తనకు పరిచయమున యువతికి దూరమవ్వాలని.. ఆమె వెంట పడవద్దంట వార్నింగ్ ఇచ్చాడు.
ఆ వివాదం అలా ఉండగానే.. మరోయువతి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బాలాజీకి పరిచయమైంది. ఈ విషయం ప్రణీత్ కు తెలిసి.. బాలాజినీ ట్రాప్ చేసేందుకు ఈ యువతిని పావుగా వాడాలని అనుకున్నాడు. ఆ యువతి.. బాలాజినీ విశాఖకు రావాల్సిందిగా కోరింది. ఆమె మాటలను నిజమని నమ్మిన బాలాజీ.. మే 28న మద్దిలపాలెం వచ్చాడు. ఆశీల్ మెట్టకు కలిసి వెల్లి.. అనంతరం వీరిద్దరూ కలిసి మద్దిలపాలెం మీదుగా.. సెంట్రల్ ఆటోలో ఆర్కే బీచ్ వైపు బయలుదేరారు. అయితే అప్పటికే పక్కా ప్లాన్ వేసుకున్న ప్రణీత్.. సహచరులతో కలిసి బైక్ లపై ఆటోను వెంబడించారు.
ఆటో ఇసుకతోట సమీపంలోకి రాగానే.. ఒక్కసారిగా ఆటోను అడ్డుకుని ఆ యువతిని మధ్యలోనే దించివేశారు. బాలాజీని ఆటోలోంచి కదలనివ్వకుండా నిర్బంధించారు. కిడ్నాప్ చేసి.. హనుమంత వాక, ఆరిలోవ, అడవివరం మీదుగా భైరవకోన నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు.
అక్కడ ప్రణీత్ అలియాస్ సున్యో, పండు, టైసన్ అనే యువకులతో పాటు మరో ఇద్దరితో కలిసి బాలాజీపై విచక్షణారహితంగా దాడి చేశారు. కత్తి, మారణాయుధాలతో దాడి చేశారు. దాడి తర్వాత తీవ్ర భయాందోళనలకు గురైన బాధితుడు.. త్రీటౌన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. నిందితులపై హత్యాప్రయత్నం, కిడ్నాప్ కేసుతో పాటు ఎస్.టి. అట్రాసిటీ కేసు నమోదు చేసి చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ కిడ్నాప్, దాడి ఘటనలో ఇనాగ్రామ్ ద్వారా పరిచయమైన యువతుల పాత్రపైనా పోలీసులు విచారిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి