దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందాలి.. మువ్వెన్నెల జెండాను ఎగురవేసిన సీఎం చంద్రబాబు
Amaravati Independence Day Celebrations

దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందాలి.. మువ్వెన్నెల జెండాను ఎగురవేసిన సీఎం చంద్రబాబు

Updated on: Aug 15, 2026 | 1:41 PM

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అట్టహాసంగా నిర్వహించిన పరేడ్‌లో సీఎం చంద్రబాబు పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు.. స్వాతంత్య్ర సమరయోధులకు నిజమైన నివాళి దేశ నిర్మాణమేనని అన్నారు.

80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.. అమరావతిలో పరేడ్ అట్టహాసంగా జరిగింది. సీఎం చంద్రబాబు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ జెండా ఎగరవేశారు. ముందుగా ప్రజలకు చంద్రబాబు స్వాతంత్య్రదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధులకు నిజమైన నివాళి దేశ నిర్మాణమే.. దేశం నాకు ఏం చేసిందని కాదు.. దేశానికి ఏం చేయగలమో ఆలోచించాలి.. 2047నాటికి వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర సాకారం చేయాలి.. వందేళ్ల స్వాతంత్య్ర వేడుకలనాటికి సమృద్ధి సాధించాలి.. దేశం, రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగాలి.. అంటూ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

ఆర్టీసీ బస్సులో ప్రయాణం..

ఏపీ సీఎం చంద్రబాబు మహిళలతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. అమరావతిలో స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన ‘స్త్రీ శక్తికి ఏడాది.. రెట్టింపైన ఆత్మగౌరవం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్త్రీ శక్తి పథకం ప్రారంభించి ఏడాదైన సందర్భంగా సీఎం బస్సులో ప్రయాణించి మహిళా ప్రయాణికులతో ముచ్చటించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా కలుగుతున్న ప్రయోజనాలను లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.

Published on: Aug 15, 2026 09:12 AM
Loading...
Unable to load recommendations.
Follow Us