AP Weather: వెదర్ రిపోర్ట్.. ఏపీలోని ఈ ప్రాంతానికి వర్ష సూచన

ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని.. దయచేసి వ్యవసాయ పనుల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్లు, టవర్స్, పోల్స్ క్రింద ఉండొద్దని.. పొలాలు ,ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదన్నారు.

AP Weather: వెదర్ రిపోర్ట్.. ఏపీలోని ఈ ప్రాంతానికి వర్ష సూచన
Rain Alert
Follow us

|

Updated on: Apr 23, 2024 | 1:00 PM

సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో దక్షిణ అంతర్గత కర్ణాటక & పొరుగు ప్రాంతాలపై ఒక ఉపరితల అవర్తనము కొనసాగుతిఉన్నది.  ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య, ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలో రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు వెదర్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసింది. కొన్ని ప్రాంతాల్లో మెరుపులు, ఉరుములతో పిడుగులు పడే అవకాశం ఉందని వెల్లడించింది.  ఆ డీటేల్స్ ఇప్పుడు తెలుసుకుందాం..

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

————————————

మంగళవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. వేడి,  తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

బుధవారం :- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

గురువారం:- తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-

——————————–

మంగళవారం, బుధవారం :- వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

గురువారం:- వాతావరణం పొడి గా ఉండే అవకాశం ఉంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

రాయలసీమ :-

——————-

మంగళవారం, బుధవారం, గురువారం  :- వాతావరణం పొడి గా ఉండే అవకాశం ఉంది . వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…  

Latest Articles