
Road Accident: ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి బృందం కారును ఓ వాహనం ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఒంగోలు సమీపంలోని పెళ్లూరు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బాపట్ల నుంచి కారు తిరుపతికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.