Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. భవానీ భక్తులను ఢీకొట్టిన కారు.. నలుగురు మృతి

Road Accident: కాకినాడ జిల్లా శంకవరం మండలం కత్తిపూడి నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు బ్రేక్ డౌన్ కావడంతో టీ తాగడానికి దిగిన భవానీ భక్తులపైకి ఓ స్కార్పియో వాహనం దూసుకెళ్లింది. ప్రమాదంలో నలుగురు భక్తులు అక్కడికక్కడే..

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. భవానీ భక్తులను ఢీకొట్టిన కారు.. నలుగురు మృతి
Road Accident

Updated on: Oct 22, 2026 | 6:58 AM

Road Accident: కాకినాడ జిల్లా శంకవరం మండలం కత్తిపూడి నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు బ్రేక్ డౌన్ కావడంతో టీ తాగడానికి దిగిన భవానీ భక్తులపైకి ఓ స్కార్పియో వాహనం దూసుకెళ్లింది. ప్రమాదంలో నలుగురు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు విజయనగరం జిల్లా డెంకాడ గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us