బాపట్ల జిల్లా రామపురం సముద్ర తీరంలో విషాదం ఘటన చోటు చేసుకుంది. విహార యాత్ర కాస్తా విషాదాన్ని నింపింది. సముద్ర తీరంలో సరదాగా స్నేహితులతో గడిపేందుకు వచ్చిన ఏడుగురు విద్యార్థులలో నలుగురు విద్యార్థులు సముద్రంలో గల్లంతు అయ్యారు. గల్లంతైన వారిలో ఒకరి మృతదేహం ఒడ్డుకు కొట్టుకురాగా, మరో ముగ్గురి ఆచూకీ కోసం గాలిస్తున్నారు అధికారులు.
ఈ విషాద ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు తెనాలి రోడ్‌లో ఉన్న GVRS ఇంజనీరింగ్ కాలేజీలో B.tech 2nd year చదువుతున్న ఏడుగురు విద్యార్థులు గురువారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో సీ బ్రీజ్ రిసార్ట్ సముద్ర బీచ్ వద్దకు వచ్చారు. సీ బ్రీజ్ పాయింట్‌కు 100 మీటర్ల దూరంలో సముద్ర తీరంలో ఆటలాడుతూ ఉన్నారు. నీటిలో సరదాగా ఈదుతూ, ఎంజాయ్ చేస్తున్నారు. సరిగ్గా మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో సముద్రంలో అలలు ఉధృతి ఎక్కువయ్యింది. ఆ సమయంలో నీటిలో ఆటలాడుతున్న విద్యార్థులు అలల ధాటికి కొట్టుకుపోయారు. మిగతా స్నేహితులు వారి కోసం చూడగా.. ప్రయోజనం లేకుండా పోయింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చేపట్టారు. గల్లంతైన ముగ్గురిలో ఓ విద్యార్థి శవం ఒడ్డుకు కొట్టుకురాగా, మరో ముగ్గురు ఆచూకీ ఇంకా తెలియరాలేదు. కాగా విద్యార్థులు గల్లంతయిన విషయం తెలుసుకున్న చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం.. రామాపూరం తీర ప్రాంతానికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
1. యడవల్లి రమణ(19) తెనాలి.
2. తాళ్లూరి రోహిత్ (20) పరిమి గ్రామం అమరావతి.
3. తిరుణగిరి మహాదేవ్ (18) హైదరాబాద్.(మృతదేహం లభ్యం)
4. పులివర్తి గౌతమ్ (20) తెనాలి.
1. కసిరెడ్డి మనోహర్ రెడ్డి (19) పొదిలి.
2. నాగురౌత్ గారి ఖలీల్ (19) బద్వేలు, కడప.
3. షేక్ రావూఫ్ (19) తెనాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..