Watch Video: బోటులో వేటకు వెళ్లిన మత్స్యకారులు.. అర్థరాత్రి నడిసముద్రంలో ఏం జరిగిందంటే..

మామూలుగానే మైదాన ప్రాంతాల్లో అగ్నిప్రమాదం జరిగితేనే మనం ఆందోళన చెందుతాం. అందుకే వేసవి కాలం వస్తే చాలా మంది అగ్ని ప్రమాదాల నుంచి భయపడుతూ ఉంటారు. ఒకసారి అగ్నిప్రమాదం చోటు చేసుకుందంటే నష్టం ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేయలేరు. భారీ ఆస్తి నష్టంతో పాటు ప్రాణనష్టం కూడా చోటు చేసుకుంటుంటుంది. అలాంటిది సముద్రంలో అగ్నిప్రమాదం జరిగితే.. అదీ కూడా అర్ధరాత్రి సమయాల్లో అయితే.. చుట్టూ ఎవరూ కనిపించకపోతే.. ఆ బోట్‎లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి.

Watch Video: బోటులో వేటకు వెళ్లిన మత్స్యకారులు.. అర్థరాత్రి నడిసముద్రంలో ఏం జరిగిందంటే..
Visakhapatnam
Follow us

| Edited By: Srikar T

Updated on: Jun 18, 2024 | 4:16 PM

మామూలుగానే మైదాన ప్రాంతాల్లో అగ్నిప్రమాదం జరిగితేనే మనం ఆందోళన చెందుతాం. అందుకే వేసవి కాలం వస్తే చాలా మంది అగ్ని ప్రమాదాల నుంచి భయపడుతూ ఉంటారు. ఒకసారి అగ్నిప్రమాదం చోటు చేసుకుందంటే నష్టం ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేయలేరు. భారీ ఆస్తి నష్టంతో పాటు ప్రాణనష్టం కూడా చోటు చేసుకుంటుంటుంది. అలాంటిది సముద్రంలో అగ్నిప్రమాదం జరిగితే.. అదీ కూడా అర్ధరాత్రి సమయాల్లో అయితే.. చుట్టూ ఎవరూ కనిపించకపోతే.. ఆ బోట్‎లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి. నడి సముద్రంలో ఇలాంటి భయానక ఘటన జరిగితే.. అందులో ప్రయాణిస్తున్న వారు తమ ప్రాణాలపై ఆశ వదులుకున్న మానసిక పరిస్థితి ఒక్క సారి ఊహిస్తేనే ఒళ్ళు గగుర్పాటుకు గురవుతుంది. కానీ తమ కాయకష్టంతో జీవించడానికి చేసే ప్రయత్నం కాబట్టి వాళ్లకు ఏదో ఒక రూపంలో సహాయం దొరుకుతుండదనడానికి నిదర్శనం ఈ ఘటన.

సముద్రంలో అగ్ని ప్రమాదం..

విశాఖ జిల్లా కేంద్రానికి 70 కిలోమీటర్ల దూరంలో తూర్పు బంగాళా ఖాతం తీరంలో ఉన్న పూడిమడక సమీపంలో ఈ ఘటన చేసుకుంది. మహేష్ అనే మత్స్యకార బోట్ యజమాని తన మిగతా ఆరుమంది మత్స్యకార సోదరులతో కలిసి ఉదయం ఒంటి గంట సమయంలో వేటకు వెళ్లారు. సుమారు ఐదు నాటికల్ చేపల వేట చేస్తుండగా బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బోటులో ఏడుగురు మత్స్యకారులు ఉన్నారు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఆ ఏడుమందికి దిక్కు తెలియలేదు. దూకుదామని అనుకున్నా అక్కడనుంచి ఒకసారి దూకితే బయటకు రావడం అంత సులభం కాదు. మరోవైపు బోట్ మొత్తం తగలబడి పోతోంది. కళ్ళముందు రూ. 40 లక్షల విలువైన బోట్ తగలబడడమే కాదు.. తమ ప్రాణాలు ఏ క్షణమైనా గాల్లో కలిసి పోతాయేమో అని భయం నెలకొంది. ఫోన్స్ ఉన్నా అక్కడ సిగ్నల్ లేకపోవడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కు మంటున్న వేళ ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

తగలబడుతున్న బోట్‎ను చూసి..

సరిగ్గా అదే సమయంలో తగలబడుతున్న మహేష్ బోట్‎ను కిలోమీటరు దూరంలో ఉన్న మరో బోట్ లో ఉన్న మత్స్యకారులు గమనించారు. దీంతో వెంటనే తగలబడుతున్న బోట్ వైపుకు వెళ్లారు. అక్కడకు వెళ్లే సమయానికి మత్స్యకార సోదరులు హాహా కారాలు వినిపించాయి. వెంటనే ఆ బోట్ దగ్గరకు వెళ్ళి ముందు అందులో ఉన్న 7 మందిని అతి కష్టం మీద వేరే బోట్‎లోనికి తీసుకురాగలిగారు. అలా బోటు మంటల్లో చిక్కుకున్న మత్స్య కారులు ప్రాణాలతో బయటపడిన వెంటనే మహేష్ బోట్ పూర్తిగా కాలిపోయింది.

ఆదుకోవాలని వేడుకోలు..

ప్రాణాలతో బయటపడినా తమ జీవనోపాధికి ఉపయోగపడే బోట్ తగలపడి పోవడం, ఇన్సూరెన్స్ కూడా లేకపోవడం‎తో గంగపుత్రులు అంతులేని ఆవేదనకు గురవుతున్నారు. రూ. 40లక్షల ఆస్తి నష్టం జరిగిందని అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి గురైన మత్స్యకారులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..