జనావాసాల్లోకి పెద్దపులి ఎంట్రీ.. సీసీ కెమెరాలో షాకింగ్ విజువల్స్.. గ్రామంలో హై అలర్ట్!

ఏలూరు జిల్లాలోని జీలుగుమల్లి గ్రామంలో పెద్దపులి సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. గ్రామ పరిసరాల్లో పెద్దపులి తిరుగుతున్న దృశ్యాలు ఓ దుకాణానికి చెందిన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియోలు బయటకు రావడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి వేళల్లో పెద్దపులి గ్రామంలోకి వస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీంతో ఎప్పుడు ఎటువైపు నుంచి పెద్దపులి వస్తుందోనని స్థానికులు భయపడుతున్నారు.

జనావాసాల్లోకి పెద్దపులి ఎంట్రీ.. సీసీ కెమెరాలో షాకింగ్ విజువల్స్.. గ్రామంలో హై అలర్ట్!
Eluru District Tiger

Updated on: Nov 15, 2026 | 8:00 AM

ఏలూరు జిల్లాలోని జీలుగుమల్లి గ్రామంలో పెద్దపులి సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. గ్రామ పరిసరాల్లో పెద్దపులి తిరుగుతున్న దృశ్యాలు ఓ దుకాణానికి చెందిన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియోలు బయటకు రావడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

రాత్రి వేళల్లో పెద్దపులి గ్రామంలోకి వస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. దీంతో ఎప్పుడు ఎటువైపు నుంచి పెద్దపులి వస్తుందోనని స్థానికులు భయపడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, మహిళలు బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. వ్యవసాయ పనులు, ఇతర అవసరాల కోసం ఇళ్ల నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

పెద్దపులి సంచారంపై సమాచారం అందుకున్న అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. రాత్రి సమయాల్లో ఒంటరిగా తిరగవద్దని, పశువులను బయట కట్టేయవద్దని సూచిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు పెద్దపులి కదలికలను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. గ్రామస్తులు పులిని చూసిన వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు.

మరోవైపు, పెద్దపులిని పట్టుకునే లేదా సురక్షితంగా అడవిలోకి తరలించే చర్యలపై స్థానికులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పులిని తరిమేందుకు లేదా దాని దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించవద్దని అధికారులు సూచిస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us