ఒకరి కష్టం ఇంకొకరి ప్రాణాలు తీసింది. ఒకర్ని కాపాడబోయిన సాహసం.. అతని ప్రాణాల్నే బలిగొంది. తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో జరిగిన ఘటన.. స్థానికులతో కన్నీరు పెట్టిస్తోంది. ముమ్మిడివరం నగర పంచాయతీకి చెందిన వాలంటీర్ పెదపూడి లక్ష్మికుమారి.. అన్నంపల్లి అక్విడెక్ట్ పైనుంచి గోదావరి నదిలోకి దూకే ప్రయత్నం చేస్తోంది. అయితే.. ఆమె తీరును గమనించిన స్థానికుడు… కౌన్సెలర్ విజయ్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. దీంతో.. ఆయన హుటాహుటిన బయల్దేరి అక్విడెక్ట్ దగ్గరకు చేరుకున్నాడు. ఈలోపు వాలంటీర్ పైనుంచి దూకేసింది. ఆమెను కాపాడేందుకు కౌన్సెలర్ విజయ్ కూడా గోదావరిలోకి దూకాడు. నదిలో కొట్టుకుపోతున్న వాలంటీర్‌ను కాపాడగలిగాడు. ఈ క్రమంలో అతను ప్రాణాలు కోల్పోయాడు
వాలంటీర్ లక్ష్మికుమారి ఎందుకు ఆత్మహత్యాయత్నం చేసింది అన్నది తెలియాల్సి ఉంది. ఆమెను కాపాడిన విజయ్ ప్రాణాలు కోల్పోవడం స్థానికులతో కన్నీరు పెట్టిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Also Read: Viral: సంచలనం.. ‘ప్లాస్టిక్ బిడ్డ’కి జన్మనిచ్చిన మహిళ.. ఇండియాలోనే