Dasara Holidays: ఏపీ, తెలంగాణలోని స్కూళ్లకు దసరా సెలవులు ఎన్ని రోజులంటే.? ఈసారి భారీగానే

దసరా పండుగ వచ్చేసింది.. విద్యార్ధులకు ఎంజాయ్‌మెంట్ తెచ్చేసింది. ఏపీ, తెలంగాణలోని స్కూళ్లకు దసరా సెలవులు వచ్చేశాయ్. అనుకున్నట్టుగానే ఈసారి విద్యార్ధులకు భారీగా సెలవులు ఇస్తూ.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తియ్యని కబురు అందించాయి.

Dasara Holidays: ఏపీ, తెలంగాణలోని స్కూళ్లకు దసరా సెలవులు ఎన్ని రోజులంటే.? ఈసారి భారీగానే
Schools

Updated on: Oct 01, 2024 | 8:13 AM

దసరా పండుగ వచ్చేసింది.. విద్యార్ధులకు ఎంజాయ్‌మెంట్ తెచ్చేసింది. ఏపీ, తెలంగాణలోని స్కూళ్లకు దసరా సెలవులు వచ్చేశాయ్. అనుకున్నట్టుగానే ఈసారి విద్యార్ధులకు భారీగా సెలవులు ఇస్తూ.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తియ్యని కబురు అందించాయి.

ఏపీలో సెలవులు ఇలా..

అక్టోబర్ 3 నుంచి దసరా సెలవులు ప్రకటించింది కూటమి సర్కార్. వాస్తవానికి అక్టోబర్ 4 నుంచి సెలవులు ఇవ్వాల్సి ఉండగా.. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు మంత్రి నారా లోకేష్ అక్టోబర్ 3 నుంచి 13 వరకు దసరా సెలవులు ప్రకటించారు. ఇక అక్టోబర్ 2 గాంధీ జయంతి ఎలాగో పబ్లిక్ హాలిడే కాబట్టి.. దాదాపుగా విద్యార్ధులకు 12 రోజుల పాటు దసరా సెలవులు ఉండనున్నాయి. అక్టోబర్ 14 నుంచి స్కూళ్లు తిరిగి పున:ప్రారంభం కానున్నాయి.

తెలంగాణలో సెలవులు అలా..

బతుకమ్మ, దసరా పండుగల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం ఈసారి భారీగా సెలవులు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 14 వరకు విద్యార్ధులకు దసరా సెలవులు లభించనున్నాయి. తిరిగి అక్టోబర్ 15న స్కూల్స్ రీ-ఓపెన్ కానున్నాయి. అక్టోబర్ 1వ తేదీన పాఠశాలల్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ జరగనున్నాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతి సెలవు కాబట్టి.. ఎలాగో స్కూల్స్, కాలేజీలకు అధికారిక సెలవు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: గుడ్‌న్యూస్.! ఏపీకి తొలి వందే మెట్రో.. ఏ రూట్‌లోనంటే.?

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us