తేడాగా కనిపించిన కారు సీటు.. తనిఖీ చేసి చూస్తే మైండ్‌బ్లాక్..! బయటపడ్డ కోట్ల బంగారం!

విశాఖపట్నంలో భారీగా విదేశీ బంగారం పట్టుబడింది. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.8.98 కోట్ల విలువైన 5.83 కిలోల బంగారాన్ని DRI అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కారులో రహస్య అరలో దాచిన 24 క్యారెట్ బంగారంతో పాటు ఇద్దరిని అరెస్టు చేసి జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు. ఈ బంగారం భారత్‌-బంగ్లాదేశ్ సరిహద్దు గుండా వచ్చినట్లు అనుమానిస్తున్నారు.

తేడాగా కనిపించిన కారు సీటు.. తనిఖీ చేసి చూస్తే మైండ్‌బ్లాక్..! బయటపడ్డ కోట్ల బంగారం!
Gold Smuggling

Updated on: Oct 11, 2026 | 5:18 PM

విశాఖపట్నంలో భారీగా విదేశీ బంగారం పట్టుబడింది. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారులో అక్రమంగా తరలిస్తున్న రూ.8.98 కోట్ల విలువైన బంగారాన్ని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (DRI) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేసి, న్యాయస్థానం ఆదేశాల మేరకు జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు.

కారులో రహస్య బాక్స్.. మూడు ప్యాకెట్లలో బంగారం

అక్టోబర్‌ 8వ తేదీ అర్థరాత్రి ఈ ఆపరేషన్‌ జరిగినట్లు DRI అధికారులు తెలిపారు. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారును DRI అధికారులు కొంతదూరం వెంబడించిన అనంతరం తనిఖీ చేశారు. ఈ క్రమంలో కారు ముందు వైపు ప్రయాణికుల సీటు కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రహస్య డెస్క్‌ను గుర్తించారు. అందులో మూడు ప్యాకెట్లుగా దాచిన 5.83 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం 24 క్యారెట్లకు చెందినదని, 999 స్వచ్ఛత కలిగి ఉందని అధికారులు గుర్తించారు. దీని విలువ సుమారు రూ.8.98 కోట్లుగా అంచనా వేశారు.

సరిహద్దు నుంచి అక్రమ రవాణా జరిగినట్లు అనుమానం

ఈ బంగారం భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దు మీదుగా అక్రమంగా దేశంలోకి తీసుకొచ్చినట్లు DRI అధికారులు భావిస్తున్నారు. అయితే బంగారం ఎక్కడి నుంచి వచ్చింది, రవాణా వెనుక ఎవరున్నారు, ఈ వ్యవహారంలో మరెవరైనా భాగస్వాములుగా ఉన్నారా అనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కస్టమ్స్‌ చట్టం, 1962 ప్రకారం బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అరెస్టయిన ఇద్దరిని జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు. ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను గుర్తించేందుకు తదుపరి విచారణ కొనసాగుతోంది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us