‘నో’ అంటే చంపేస్తారా..? నిరాకరణను తట్టుకోలేని ఉన్మాదానికి మరో మహిళ బలి!

ప్రేమించలేదని, పెళ్లికి ఒప్పుకోలేదని కక్ష పెంచుకున్న ఓ ఉన్మాది.. నడిరోడ్డుపై వివాహితను అత్యంత దారుణంగా కత్తితో నరికి చంపిన దారుణం పశ్చిమగోదావరి జిల్లాలో జూన్ నెలలో జరిగింది. కారులో ప్రయాణిస్తున్న మహిళపై విచక్షణారహితంగా దాడి చేసి ప్రాణాలు తీసిన ఆ రాక్షసుడిని చివరికి పోలీసులు అరెస్ట్ చేశారు. 45 రోజుల పాటు ఆసుపత్రి బెడ్‌పై చికిత్స పొందిన ఆ నిందితుడు డిశ్చార్జ్ కాగానే పోలీసులు సంకెళ్లు వేశారు. అసలు ఆ రోజు కారులో ఏం జరిగింది? పెళ్లి ప్రతిపాదన నుంచి హత్య వరకు అసలు ఏమి జరిగింది.

నో అంటే చంపేస్తారా..? నిరాకరణను తట్టుకోలేని ఉన్మాదానికి మరో మహిళ బలి!
Arrest

Edited By:

Updated on: Aug 06, 2026 | 12:57 PM

ప్రేమించలేదని, పెళ్లికి ఒప్పుకోలేదని కక్ష పెంచుకున్న ఓ ఉన్మాది.. నడిరోడ్డుపై వివాహితను అత్యంత దారుణంగా కత్తితో నరికి చంపిన దారుణం పశ్చిమగోదావరి జిల్లాలో జూన్ నెలలో జరిగింది. కారులో ప్రయాణిస్తున్న మహిళపై విచక్షణారహితంగా దాడి చేసి ప్రాణాలు తీసిన ఆ రాక్షసుడిని చివరికి పోలీసులు అరెస్ట్ చేశారు. 45 రోజుల పాటు ఆసుపత్రి బెడ్‌పై చికిత్స పొందిన ఆ నిందితుడు డిశ్చార్జ్ కాగానే పోలీసులు సంకెళ్లు వేశారు. అసలు ఆ రోజు కారులో ఏం జరిగింది? పెళ్లి ప్రతిపాదన నుంచి హత్య వరకు అసలు ఏమి జరిగింది.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లిలంకకు చెందిన 31 ఏళ్ల టీనా రోజా అనే వివాహిత జీవితం ఒక్క క్షణంలో ముగిసిపోయింది. ఏఎన్ఎమ్ కోర్సు పూర్తి చేసి సూళ్లూరుపేటలోని నర్సింగ్ కళాశాలలో ట్రైనింగ్ పొందుతున్న రోజా.. జూన్ 21న సొంత ఊరికి బయలుదేరింది. స్నేహితుడు అంగర సురేష్‌బాబు కారులో నరసాపురం నుంచి ఊరికి వెళ్తుండగా.. దారి మధ్యలో అదే గ్రామానికి చెందిన మార్గాని రమేష్ మాయమాటలతో కారు ఎక్కాడు. కారు కాస్త ముందుకెళ్లగానే.. “నన్ను పెళ్లి చేసుకో” అంటూ రోజాపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. దానికి ఆమె ఖరాకండిగా ‘నో’ చెప్పడంతో అతను విచక్షణ కోల్పోయాడు.

నడిరోడ్డుపై కత్తితో విరుచుకుపడ్డాడు!

పెళ్లికి నిరాకరించిందన్న ఒక్క కారణంతో.. వెంట తెచ్చుకున్న కత్తితో రోజాపై రమేష్ విచక్షణారహితంగా విరుచుకుపడ్డాడు. సీటులోనే రక్తపు మడుగులో విలవిలలాడుతున్న ఆమెను కాపాడేందుకు కారు డ్రైవర్ సురేష్‌బాబు ప్రాణాలకు తెగించి అడ్డుపడ్డాడు. ఈ క్రమంలో జరిగిన తీవ్ర ఘర్షణలో నిందితుడు రమేష్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. రక్తసిక్తమైన ఆ దృశ్యం ఘటన జరిగిన రోజు నరసాపురం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.

45 రోజుల డ్రామా తర్వాత కటకటాల్లోకి..!

ఘటన జరిగిన తరువాత దాడిలో గాయపడిన నిందితుడు రమేష్ గత 45 రోజులుగా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీసుల పర్యవేక్షణలో చికిత్స పొందుతూ వచ్చాడు. బుధవారం (ఆగస్టు 05) అతడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే నరసాపురం డీఎస్పీ ఎం. సుధాకరరావు, పట్టణ సీఐ ఆకుల రఘు, ఎస్సై ముత్యాలరావు బృందం రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఉన్మాదంతో ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్న ఆ నిందితుడిని పోలీసులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us