ఏపీ తీరంవైపు దూసుకువస్తున్న అర్నబ్ తుపాను.. భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు..

బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపాను ఆంధ్రప్రదేశ్ తీరంవైపు కదులుతోంది. అక్టోబర్ 28 ఉదయం బాపట్ల–విశాఖపట్నం మధ్య యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలుల ముప్పు నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.

ఏపీ తీరంవైపు దూసుకువస్తున్న అర్నబ్ తుపాను.. భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు..
Cyclone Arnab Latest Updates

Updated on: Oct 27, 2026 | 8:15 AM

LIVE NEWS & UPDATES

  • 27 Oct 2026 08:15 AM (IST)

    ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు

    ప్రాణన‌ష్టం జరగకుండా ఏపీ ప్రభుత్వం కూడా సన్నద్ధం అవుతుంది. ఆయా శాఖ‌ల అధికారుల‌తో ముంద‌స్తు చర్యల‌పై స‌మీక్ష‌లు నిర్వహించారు.. ఇప్పటికే 11 జిల్లాల‌కు SDRF, NDRF బృందాల త‌ర‌లించారు. ఇక మ‌ధ్యాహ్నం నుంచి తీర‌ప్రాంత ర‌హ‌దారుల‌పై రాక‌పోక‌లు బంద్‌ అవుతాయి. మరీ ముఖ్యంగా బాపట్ల జిల్లాలోనే అధిక వర్షపాతం నమోదు కాబోతుందన్న అంచనాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్.

  • 27 Oct 2026 08:02 AM (IST)

    ఎగసిపడుతున్న సముద్రం.. సురక్షిత ప్రాంతాలకు తీర ప్రాంత వాసులు

    కోనసీమలో తుఫాన్ ఎఫెక్ట్.. తీర ప్రాంత వాసులు సురక్షిత ప్రాంతాలకు తరలింపు..

    అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆర్నాబ్ తుఫాన్ ఎఫెక్ట్ తీర ప్రాంత ప్రజల సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు

    తుఫాన్ ప్రభావంతో కోనసీమ లో పూర్తిగా మారిపోయిన వాతావరణం..ఎగసిపడుతున్న సముద్రం..

    ఉప్పలగుప్తం మండలం వాసాలతిప్ప సముద్ర తీరం వద్ద ఉన్న మత్స్యకార కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన ఆర్డిఓ ..

    వేటకు వచ్చిన విశాఖ జిల్లా నక్కపల్లి కి చెందిన 400 మందిని తుఫాన్ షెల్టర్లకు తరలింపు..

    నిన్న రాత్రి నుండి తీర ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు ..

    అమలాపురం డివిజన్లో 1000 నుండి 1500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకున్నామన్న ఆర్డీవో సరళాదేవి..

    నేటి నుండి రెండు రోజులపాటు స్కూల్స్ సెలవులు ప్రకటించిన జిల్లా కలెక్టర్..

    అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ హెచ్చరించిన కలెక్టర్..

    జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసిన కలెక్టర్ మహేష్ కుమార్..

  • 27 Oct 2026 07:46 AM (IST)

    తుపాను ఎంత దూరంలో ఉందంటే..

    బంగాళాఖాతంలో అత్యంత తీవ్ర తుపానుగా ‘అర్నబ్‌’

    గత 6 గంటల్లో గంటకు 25 కి.మీ. వేగంతో పశ్చిమ-వాయవ్య దిశగా పయనం

    విశాఖపట్నానికి ఆగ్నేయంగా 300 కి.మీ. దూరంలో తుపాను

    కాకినాడకు తూర్పు-ఆగ్నేయంగా 360 కి.మీ. దూరంలో కేంద్రం

    గోపాల్‌పూర్‌కు దక్షిణంగా 380 కి.మీ. దూరంలో తుపాను

    సాయంత్రం వరకు పశ్చిమ-వాయవ్య దిశగా తుపాను కదలిక

    అక్టోబర్ 28 ఉదయం ఏపీ తీరాన్ని దాటే అవకాశం

    బాపట్ల–విశాఖపట్నం మధ్య యానాం సమీపంలో తీరం దాటే సూచనలు

  • 27 Oct 2026 07:29 AM (IST)

    విశాఖ జిల్లాల్లో అలర్ట్

    విశాఖ జిల్లాలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున ఆయా ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మత్స్యకారులను ఇప్పటికే ఒడ్డుకు చేర్చారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని అంటున్నారు అధికారులు.

  • 27 Oct 2026 07:23 AM (IST)

    కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు

    విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశారు.

    విశాఖ కలెక్టరెట్ 24*7 కంట్రోల్ రూం నెంబర్లు 8912590100, 8912590102

    జీవీఎంసీ టోల్ ఫ్రీ 180042500009, వాట్సాప్ 9014218870

    విశాఖ ఏపీ ఈపీడీసీఎల్ 7382299975, మెడికల్ 8985181874, 9398786818, ఫిషరీస్ 9491808388 కంట్రోల్ రూమ్ నంబర్లు

    విశాఖలో 37 ముంపు ప్రాంతాలు గుర్తింపు.. 54 పునరావాస కేంద్రాల ఏర్పాటు చేశారు.

    అల్లూరి జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ వివరాలు

    ల్యాండ్‌లైన్ నంబర్: 08935-293448, అత్యవసర సంప్రదింపు నంబర్: 92818 56953

  • 27 Oct 2026 07:13 AM (IST)

    ప్రారంభమైన తుపాను ప్రభావం.. భారీ వర్షాలు

    పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుఫాన్ అతి తీవ్ర తుపాన్ గా బలపడింది. పలు ప్రాంతాల్లో తుపాను ప్రభావం ప్రారంభమైంది.

    మరికాసేపట్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు

    శ్రీకాకుళం జిల్లాల్లో ఈదురుగాలులతో భారీ వర్షాలు

    కోస్తా జిల్లాల్లో ప్రారంభమైన ఈదురుగాలులు

    ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

    మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా తుపాన్ స‌మ‌స్య‌లకు వేగవంతమైన రెస్పాన్స్ : ప్రఖర్ జైన్ ,ఎండీ , విపత్తుల నిర్వహణ సంస్థ

  • 27 Oct 2026 07:03 AM (IST)

    ఏపీలో భారీ వర్షాలు..

    అర్నబ్ తుఫాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు.. లైవ్ వీడియో చూడండి..

  • 27 Oct 2026 06:59 AM (IST)

    స్కూళ్లకు రెండు రోజులు సెలవులు

    16 జిల్లాల్లోని 2,460 రెవెన్యూ గ్రామాలు, 92 ప‌ట్టణ ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువ‌గా ఉంటుంద‌ని అంచ‌నా వేశారు. ఇవాళ, రేపు పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

  • 27 Oct 2026 06:58 AM (IST)

    తీరం దాటేది ఎప్పుడంటే..

    అక్టోబర్ 28 ఉదయం బాపట్ల–విశాఖపట్నం మధ్య యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని IMD తెలిపింది. గరిష్ఠంగా గంటకు 115–125 కి.మీ. వేగంతో గాలులు, 140 కి.మీ. వరకు గాలివానలు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అర్నబ్ అతి తీవ్ర తుఫానుగా బలపడింది. గంటకు 25 కిలో మీటర్ల వేగంతో కదులుతూ.. తీవ్ర తుఫాను కదులుతోందని వాతావరణ శాఖ తెలిపింది. విశాఖకు 300 కిలోమీటర్లు, కాకినాడకు 360 కి.మీ., గోపాల్ పూర్‌కు 380 కి.మీ., మచిలీపట్నంకు 460 కి.మీ., బాపట్లకు 530 కిలోమీటర్ల దూరంలో అర్నబ్ కేంద్రీకృతమైంది. ఈ సాయంత్రం వరకు అర్నబ్ తుఫాన్ పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించనుంది. ఆ తరువాత అర్నబ్ వాయువ్యదిశగా దిశ మార్చుకోనుంది. రేపు ఉదయానికి విశాఖ – బాపట్ల మధ్య యానాంకు సమీపంలో తీరం దాటనుంది. అర్నబ్ తీరం దాటే సమయంలో గంటకు 110-140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బాపట్ల నుంచి విశాఖ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కృష్ణా నదిని ఆనుకొని ఉన్న మండలాల్లో ఎక్కువగా వర్షాలు కురుస్తాయి.. అన్ని పోర్టుల్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తుఫాను ప్రభావంతో మంగళవారం, బుధవారం రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని.. కోస్తా తీరం వెంబడి గంటకు 90–100 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. విపత్తుల నిర్వహణ సంస్థ ఎంపీ ప్రఖర్ జైన్ సూచించారు.  ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.

లైవ్ వీడియో చూడండి..

Loading...
Unable to load recommendations.
Follow Us