AP News: వైభవంగా అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి రథోత్సవం.. పాల్గొన్న వేల మంది భక్తులు..

అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది పురవీధుల్లో నమో నారసింహ నామస్మరణ మార్మోగింది. స్వామి వారి రధోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. రథోత్సవంలో వేలమంది భక్తులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నరసింహుడి రథయాత్ర సాఫీగా సాగింది. కోనసీమ జిల్లా ఆధ్యాత్మిక నగరం సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు కనుల పండువగా సాగుతున్నాయి.

AP News: వైభవంగా అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి రథోత్సవం.. పాల్గొన్న వేల మంది భక్తులు..
Antarvedi Lakshmi Narasimha
Follow us

| Edited By: Srikar T

Updated on: Feb 20, 2024 | 10:56 PM

అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది పురవీధుల్లో నమో నారసింహ నామస్మరణ మార్మోగింది. స్వామి వారి రధోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. రథోత్సవంలో వేలమంది భక్తులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నరసింహుడి రథయాత్ర సాఫీగా సాగింది. కోనసీమ జిల్లా ఆధ్యాత్మిక నగరం సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు కనుల పండువగా సాగుతున్నాయి. మంగళవారం రథయాత్ర నేత్రపర్వంగా జరిగింది. భీష్మ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని మధ్యాహ్నం 2.05 గం..కు మెరక వీధి నుండి కదిలిన రథం అశేష జనవాహిని గుండా పరుగులు తీసింది. భక్తులు రథాన్ని లాగుతూ దివ్య నామస్మరణ చేశారు. అక్కడ నుండి స్వామి వారి సోదరి అయిన అశ్వరూఢాంబిక ఆలయం వద్దకు వెళ్ళి తిరిగి 16 కాళ్ల మండపం సమీపానికి చేరుకోవడంతో రథోత్సవ ఘట్టం ముగిసింది.

తొలుత ఆలయ చైర్మన్, ధర్మకర్తల కుటుంబ సభ్యులు శ్రీ రాజా కలిదిండి కుమార రామ గోపాల రాజా బహదూర్ ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయ కొట్టి రధోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్ష్ శుక్లా, ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‎రావు కొబ్బరికాయలు కొట్టారు. తెల్లవారుజామున స్వామి, అమ్మవార్ల కళ్యాణమనంతరం నూతన వధూవరులతో దేవాది దేవుడు మధ్యాహ్నం 2 గం.. లకు రథంపై భక్తులకు దర్శనమిచ్చారు. కళ్యాణం అనంతరం స్వామివారు ఉభయ దేవరులతో కలిసి రథోత్సవంలో పాల్గొనడం అంతర్వేది క్షేత్రంలో శతాబ్దాల కాలంగా ఆనవాయితీగా వస్తుంది. దీనికిగాను మెరక వీధిలో ఉన్న రథాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనేక మంది భక్తులు రథం చుట్టూ అరటి గెలలు కట్టి మ్రొక్కులు తీర్చుకుంటారు. రథం వెంబడి భక్తులు భక్తి శ్రద్ధలతో గోవింద నామస్మరణతో స్వామి వారిని స్మరించారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. కళ్యాణోత్సవం అనంతరం స్వామి వారు సోదరి గుర్రాలక్కకు చీర – సారె అందిస్తారు. దీనిని తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..