CID Notice Chandrababu: సీఐడీ నోటీసులపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్న చంద్రబాబు నాయుడు

CID Notice Chandrababu: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సీఐడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే సీఐడీ నోటీసులపై బుధవారం ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలయ్యే అవకాశం ఉంది. తనపై నమోదైన..

CID Notice Chandrababu: సీఐడీ నోటీసులపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్న చంద్రబాబు నాయుడు
Chandrababu
Follow us

|

Updated on: Mar 17, 2021 | 10:56 AM

CID Notice Chandrababu: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సీఐడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే సీఐడీ నోటీసులపై బుధవారం ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలయ్యే అవకాశం ఉంది. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని చంద్రబాబు పిటిషన్‌ను వేయనున్నారు. కాగా, చంద్రబాబు విషయంలో జగన్‌ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

కాగా, అమరావతి భూముల అక్రమాల కేసులో మంగళవారం నాడు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు చేరుకుని ఈ నోటీసులను అందజేశారు. అమరావతి రాజధాని భూముల అక్రమాలపై చంద్రబాబుకు నోటీసులిచ్చేందుకు.. ఉదయమే హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు ఏపీ సీఐడీ అధికారులు. విచారణకు హాజరుకావలసిందిగా నోటీసులు జారీ చేశారు. చంద్రబాబుపై 120బి, 166, 167, 217 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. అలాగే చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణకు కూడా 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు సీఐడీ అధికారులు.

ఇవీ చదవండి: MLA Danam Nagender: ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ వియ్యంకుడిపై గుర్తు తెలియని దుండగుల రాళ్లదాడి

ఏపీ స్టేట్‌ హ్యూమన్‌ రైట్స్ కమిషన్‌ చైర్మన్‌ ఎంపికపై భేటీ.. సీఎం జగన్‌ ఆహ్వానాన్ని తిరస్కరించిన ప్రతిపక్ష నేతలు