Chicken Prices: చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఒక్కసారిగా పడిపోయిన చికెన్ ధరలు.. కిలో ఎంతంటే..?

సామాన్యులకు శుభవార్త. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు పడిపోయాయి. దీంతో పాటు కోడి గుడ్ల ధరలు కూడా తగ్గాయి. దీంతో సామాన్యులకు భారం తగ్గినట్లయింది. మొన్నటివరకు కిలో చికెన్ రూ.400 వరకు చేరుకోగా.. ఒక్కొ గుడ్డు రూ.10 పలికిలంది. ఇప్పుడు ధరలు దిగొస్తున్నాయి.

Chicken Prices: చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఒక్కసారిగా పడిపోయిన చికెన్ ధరలు.. కిలో ఎంతంటే..?
Chicken Shops Closed In Hyderabad

Updated on: Apr 12, 2026 | 10:13 AM

చికెన్ ప్రియులకు ఎగిరి గంతేసే వార్త. చికెన్ ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. మొన్నటివరకు కేజీ చికెన్ రూ.350 వరకు పలకగా.. ఇప్పుడు రూ. 100 మేర తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ఎక్కువగా తింటూ ఉంటారు. ఇక ఆదివారం వచ్చిందంటే.. చికెన్ షాపుల ముందు క్యూ కడతారు. దీంతో సండే రోజు చికెన్ షాపులు కస్టమర్లతో కళకళలాడుతూ ఉంటాయి. చికెన్ ధరలు తగ్గడం కస్టమర్లకు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

పెరిగిన చికెన్ ధరలు

ఇవాళ విజయవాడలో కేజీ స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.243, డ్రస్స్‌డ్ రూ.213, రిలైట్ లైవ్ బర్డ్ రూ.147, ఫారం దగ్గర లైవ్ బర్డ్ రూ.120గా ఉన్నాయి. ఇక కరీంనగర్‌లో నేడు స్కిన్ లెస్ చికెన్ రూ.259గా ఉండగా.. డ్రస్స్‌డ్ చికెన్ రూ.228, ఫారం దగ్గర లైవ్ బర్డ్ రూ.130, రిటైల్ లైవ్ బర్డ్ రూ.157గా ఉంది. ఇక హైదరాబాద్‌లో స్కిన్ లెస్ చికెన్ రూ.259గా ఉంది.

తగ్గిన కోడి గుడ్ల ధరలు

ఇక తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్ల ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్ జోన్‌లో 12 గుడ్ల రిటైల్ ధర రూ.68గా ఉంది. ఇక విజయవాడలో 12 గుడ్ల ధర రూ.60గా ఉంది. అయితే గత నెలలో కోడిగుడ్ల ధరలు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. రిటైల్ షాపుల్లో ఒక్కొ గుడ్డు ధర రూ.10కి చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఒక్కొ గుడ్డు ధర రూ.4.50గా ఉండగా.. విజయవాడలో రూ.4.70 నుంచి రూ.4.80 మధ్య ఉంది. ఇక విశాఖపట్నంలో గుడ్డు ధర రూ.4.55 నుంచి రూ.4.65 మధ్య ఉంది. ఇక తూర్పుగోదావరి జిల్లాలో రూ.4.60గా ఉండగా.. చిత్తూరులో రూ.4.88గా ఉంది. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో చికెన్, కోడిగుడ్ల ధరలు తగ్గడంతో సామాన్యులు ఊరట చెందుతున్నారు.

తగ్గడానికి కారణాలేంటి..?

ఇరాన్-ఇజ్రాయెల్ వార్ వల్ల విదేశాలకు భారత్ నుంచి కోడిగుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో భారత్‌లో నిల్వలు ఎక్కువగా ఉండటం వల్ల ధరలు తగ్గాయి. ఇక వేసవికాలం కారణంగా ఫామ్స్‌లో కోళ్ల నిర్వహణ కష్టమవుతుంది. దీంతో ఫామ్స్ నిర్వాహకులు కోళ్లను వెంటనే అమ్ముకుంటున్నారు. దీని వల్ల కోళ్ల సరఫరా ఎక్కువగా ఉండటం వల్ల ధరలు తగ్గుతున్నాయి. మరికొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు.

Follow Us